ఆంధ్రప్రదేశ్‌

మానవ సహిత రాకెట్ ఇస్రోకు ఓ ఛాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 4: మానవ సహిత రాకెట్ (హ్యూమన్) ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) ఒక చాలెంజ్ లాంటిదని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. మంగళవారం ఆయన ఇస్రో శాస్తవ్రేత్తలతో కలసి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని షార్ ఉద్యోగుల కాలనీ పులికాట్ నగర్‌లో నూతనంగా రూ.2.8 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రాంరభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివన్ మాట్లాడుతూ దేశ అవసరాల నిమిత్తం భారీస్థాయిలో ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోందన్నారు. అందులో భాగంగా వచ్చే మూడేళ్లలో షార్ నుంచి 59 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టడం ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మానవ సహిత రాకెట్ (హ్యూమన్) ప్రయోగంపై ఆసక్తి కనబరుస్తున్నారని, ఆ ప్రయోగం ఇస్రోకు ఓ ఛాలెంజ్ లాంటిదని, ఆ దిశగా శాస్తవ్రేత్తలు పనిచేస్తున్నారని తెలిపారు. యావత్తు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 భారీ రాకెట్ ప్రయోగం వచ్చే ఏడాది జనవరి 3న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ దిశగా షార్‌లో కూడా శరవేగంగా మార్క్-3 ప్రయోగ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

16న పీఎస్‌ఎల్‌వీ-సీ 42 ప్రయోగం
ఈనెల 16న భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ 42 (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం చేపడుతున్నామని శివన్ స్పష్టం చేశారు. ఈ రాకెట్ యుకెకు చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్‌తో కలసి శాస్తవ్రేత్తలతో ఇస్రో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రయోగానికి సబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన శాస్తవ్రేత్తలతో కలసి మొదటి ప్రయోగ వేదికపై ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సీ42 రాకెట్‌ను పరిశీలించారు. ఇస్రో వాణిజ్యరంగ ప్రయోగమైన ఈ రాకెట్ ద్వారా ఇంగ్లండ్ దేశానికి చెందిన నోవాది సర్-ఎస్, ఎస్‌ఎస్‌టీఎల్-ఎస్ 14 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నామని, ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై మూడు దశల రాకెట్ అనుసంధాన పనులను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారన్నారు. ఈనెల 16వ తేదీ రాత్రి 10 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు శివన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ, పబ్లికేషన్ అండ్ పబ్లిసిటీ అధికారి విశ్వనాధ్ శర్మ తదితర షార్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.