ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 4: ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానీయకుండా జగన్ అడ్డుకుంటున్నారని కళా ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉంటుందన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం మరడాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రల పేరిట జగన్ తిరుగుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం చూస్తుంటే ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు విశ్వాసం లేదని, అసెంబ్లీ బహిష్కరణ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు.

సహకార శాఖలో ఆరేళ్ల తర్వాత పదోన్నతులు, పోస్టింగ్‌లు
విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్ర సహకార శాఖలో దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ క్యాడర్లలో మంగళవారం 70 మందికి పదోన్నతులు, తక్షణ పోస్టింగ్‌లు లభించాయి. ఈ సందర్భంగా ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణిపేర్రాజు, ప్రధాన కార్యదర్శి కే భావనరుషిలు ఓ ప్రకటనలో రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ జే మురళి, అడిషినల్ రిజిస్ట్రార్ విజయలక్ష్మీలకు కృతజ్ఞతలు తెలిపారు.