ఆంధ్రప్రదేశ్‌

నూతన ఆవిష్కరణల కేంద్రంగా అమరావతి: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయిలో ఆవిష్కరణల కేంద్రంగా తీర్చి దిద్దాలనేది ప్రభుత్వలక్ష్యమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాజధాని పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో సోమవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్ఫర్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్-ఇంపాక్టింగ్ ది ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ (ఐసీటీఐఈఈఏపి-2018) సదస్సుకు మంత్రి లోకేష్‌తో పాటు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. తొలుత ఐసీటీఐఈఈ -2018 గేమింగ్ డెవలప్‌మెంట్ చాలెంజ్ బుక్‌లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలోని అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా 2050కల్లా ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించే అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ఇప్పటికే 12 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఏడాది క్రితం ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఏర్పాటయిందని చెప్పారు. ఏడాదిలోనే అత్యాధునిక సదుపాయాలతో తరగతులు ప్రారంభించటం శుభపరిణామమన్నారు.
ఏపీఎస్‌ఎస్‌డీసి ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు 500 మందికి ఫిన్‌ల్యాండ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో ఇండియన్ గేమింగ్ డెవలప్‌మెంట్ చాలెంజ్ పేరిట శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగావకాశాల కోసం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏపీఎస్‌ఎస్‌డీసి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సదస్సు నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. నాలెడ్జిహబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. సంస్థ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యతా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలోనే ఏపీఎస్‌ఎస్‌డీసి, కజాని యూనివర్శిటీ సంయుక్తంగా ఇండియన్ గేమింగ్ డెవలప్‌మెంట్ చాలెంజ్ పేరుతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి శిక్షణ ద్వారా విద్యార్థులు నైపుణ్యతను పెంపొందించుకుని ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వర్శిటీ వీసీ పరివేందర్ మాట్లాడుతూ ఏడాది కాలంలో రెండువేల మందితో తరగతులు ప్రారంభించామన్నారు.
దేశంలో ఏటా 15 లక్షలమంది ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తుంటే కేవలం 10 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితులను మార్పుచేసే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకశాఖలు ఏర్పాటుచేశాయని గుర్తుచేశారు. అనంతరం శిక్షణా శిబిరాలను మంత్రులు సందర్శించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసి వ్యవస్థాపకులు డాక్టర్ కె లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ గంటా సుబ్బారావు, వర్శిటీ ప్రెసిడెంట్ పి సత్యనారాయణ్ తదితరులు పాల్గొన్నారు.