ఆంధ్రప్రదేశ్‌

‘ఆపరేషన్ గరుడ’లో కీలక పాత్రధారి ఐవైఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 16: ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ కృష్ణారావు కీలక పాత్రధారి అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కోకన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని విమర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఆయన గతంలోనూ కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతిష్టకు మచ్చతెచ్చేలా కోట్లాది మంది భక్తుల మనోభావాలను మంటగలిపారన్నారు. ఢిల్లీ నుంచి నడుపుతున్న ఆపరేషన్ గరుడ నాటకంలో పాత్రధారిగా బీజేపీలో చేరిన కృష్ణారావు బ్రాహ్మణ జాతిని తాకట్టుపెట్టే ప్రయత్నాలు చేయనున్నారని దుయ్యబట్టారు.
ఈ కుట్ర రాజకీయాల పట్ల బ్రాహ్మణ సమాజం జాగ్రత్తగా, చైతన్యంతో ఉండాలన్నారు. బీజేపీ, వైసీపీ బంధాన్ని బలపర్చేందుకు కృష్ణారావు కృషి చేస్తున్నారని ఆరోపించారు. అందులోభాగంగా ఇటీవల విశాఖపట్నంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్‌తో పాటు కృష్ణారావు కూడా పాల్గొని కుట్ర రాజకీయాల ముసుగు తొలగించారని విమర్శించారు.
రాజధాని అమరావతి నిర్మాణ విషయమై గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన కేంద్రానికి తప్పుడు నివేదికలు అందించారని ఆరోపించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు అండగా ఉన్న బ్రాహ్మణ సమాజంలో చీలిక తెచ్చేందుకు ఐవైఆర్ బీజేపీ, వైసీపీలతో ప్యాకేజీ కుదుర్చుకున్నారని ఆరోపించారు.
అందుకే ఆపరేషన్ గరుడలో కృష్ణారావుకు బీజేపీ రథసారథి అమిత్ షా కీలక పాత్ర కల్పించారని శ్రీ్ధర్ వివరించారు. విలేఖరుల సమావేశంలో వడ్లమూడి రాజా, అమ్మిరాజు నారాయణ, పెద్దిరాజు కిరణ్, మోదుకూరు సాయికుమార్, ఎండవల్లి శబరి, తదితరులు పాల్గొన్నారు.