ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని చైనాలోని తెలుగువారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో ఆదివారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు కలిసే ఉన్నారన్నారు. తెలుగువారు ఎక్కుడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలుగువారు కృషి చేయాలని కోరారు. ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు చుట్టుముట్టాయన్నారు. లోటు బడ్జెట్, ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయం కూడా తక్కువ ఉండిందని తెలిపారు. అయితే సమస్యలను అధిగమించి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. వరుసగా రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు. దేశంలో అనేక మంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారని, కానీ మన ముఖ్యమంత్రి చేసి చూపించారన్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశారని, పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం ద్వారా అనంతపురం జిల్లాకు కియా మోటార్సును రప్పించామన్నారు. ఏపీలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఐదు జోన్లలో ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు.
ఎలక్ట్రానిక్స్‌లో చైనా అందరికంటే ముందుందని, ఏపీలో కూడా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థలో 15వేల మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు.
భవిష్యత్తులో దేశంలో480 బిలియన్ డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌ని వినియోగించనున్నట్లు ఒక అంచనా అని తెలిపారు. అందులో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌ను ఏపీలో ఉత్పత్తి చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్లాస్టిక్స్ నుంచి బ్యాటరీల తయారీ వరకూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగువారి సమస్యలు పరిష్కరించేందుకు ఏపీఎన్నార్టీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. చైనాలో ఉంటున్న తెలుగువారంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, తాము పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రం గురించి చెప్పడం ప్రారంభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.