ఆంధ్రప్రదేశ్‌

రైతుల ప్రగతి.. డ్వాక్రా అభ్యున్నతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 27: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితంచేసే శక్తివున్న రైతులు, డ్వాక్రా సంఘాలకు సంక్షేమ తాయిలాలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ రెండు వర్గాలకూ చేసిన మేలు విషయం ఎలావున్నప్పటికీ ఇపుడు రైతులు, మహిళా స్వయంశక్తి సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఆరు నెలల్లో రైతులు, స్వయం సహాయక సంఘాలకు సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలుచేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ప్రాథమిక రంగాల ప్రగతిలో అగ్రస్థానం సాధించడానికి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో సుమారు నాలుగున్నర లక్షల మంది కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది కౌలు రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 800 కోట్ల రూపాయలను పంట రుణాలుగా అందించారు. గత సంవత్సరం జిల్లాలో కేవలం 1 లక్షా 20వేల మంది కౌలు రైతులకు మాత్రమే పంట రుణాలందించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఎల్‌ఈసీ కార్డులున్న కలిగిన కౌలు రైతులందరికీ పంట రుణాలందించి, నూరు శాతం ప్రగతి సాధించాలని ప్రభుత్వం ఆదేశించింది. అడిగిన వారందరికీ రుణాలు కల్పించడం ద్వారా ప్రభుత్వంపై కౌలుదార్లకు పూర్తి నమ్మకం కలిగించాలని ఆదేశించింది. ముఖ్యంగా ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని త్వరితగతిన పంపిణీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రానున్న నాలుగైదు నెలల్లో రైతులు, కౌలుదారులకు సంబంధించి ఏ ఒక్క సమస్యా పెండింగ్‌లో ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవనాల అభివృద్ధి, బిందు సేద్యం వంటి వ్యవసాయ విధానాల్లో రైతులను ప్రోత్సహించాలని ఆదేశించింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది.
డ్వాక్రా ఉద్యమానికి కేరాఫ్‌గా పేర్కొనే తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంక్ లింకేజీ లక్ష్యాల సాధనకు చర్యలు చేపట్టారు. అధిక శాతం మహిళలు బ్యాంక్ రుణాలను పొందే విధంగా బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంవత్సరం 64,133 స్వయం సహాయక సంఘాలకు 1344 కోట్లు రుణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 29వేల 310 సంఘాలకు 866 కోట్లు మంజూరు చేశారు.
స్ర్తినిధి పథకం కింద 17,715 మందికి 70.84 కోట్ల పంపిణీ లక్ష్యం కాగా 10,541 మందికి 51.13 కోట్ల రూపాయల మేరకు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన మహిళలకు రుణాలను త్వరితగతిన పంపిణీ చేసే పనిలో అధికారులున్నారు. స్ర్తినిధి, ఉన్నతి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తదితర పథకాల కింద మహిళలకు రుణాల కల్పన ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.