ఆంధ్రప్రదేశ్‌

15 శాతం వృద్ధిరేటు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అమెరికాలో న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో సాంకేతికత యుగంలో పరిపాలన అన్న అంశంపై గురువారం చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, ప్రజల్లో సంతృప్తిని పెంచేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటూ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. నాలుగేళ్ల కృషితో ఏపీ రెండంకెల వృద్ధి రేటు సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా, భారత ప్రభుత్వం సగటున 7.3 శాతం వృద్ధి రేటు సాధిస్తే, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని తన రాష్ట్రం 10.52 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని వెల్లడించారు. సంతోషంగా గడపడటమే అర్థవంతమైన జీవితమని, అంతిమంగా వన్ గవర్నమెంట్-వన్ సిటిజెన్ తమ లక్ష్యమన్నారు. విజిబుల్ గవర్నెన్సు- ఇన్‌విజిబుల్ గవర్నమెంట్ తమ ధ్యేయమన్నారు. ప్రజలే ముందు అని, వారి సాధికారతే తమ ధ్యేయమన్నారు. 15 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కష్టపడి పని చేస్తున్నామన్నారు.
ఆధార్ అనుంధానంతో అక్రమాలకు అడ్డుకట్ట
ఆధార్ ఒక బహుమతి లాంటిదని ముఖ్యమంత్రి అభివర్ణించారు. గతంలో చనిపోయిన వారి పేరిట కూడా పింఛన్లు తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఆధార్ అనుసంధానంతో అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. ఆధార్ అనుసంధానంతో సమాజంలో చిట్టచివరన ఉన్న అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేరవేయగలుగుతున్నామన్నారు. పింఛను, బీమా, రేషన్ అన్ని రంగాలకు ఆధార్ ఆధారంగా సేవలు అందుతున్నాయన్నారు. ల్యాండ్ హబ్, పీపుల్స్ హబ్, ఈ-ఆఫీస్ వంటి సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డుతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రియల్ టైమ్‌లో డేటాను చూడవచ్చన్నారు. వీధీ దీపాలు, వర్షపాతం, భూగర్భ జలాలు, ఉపరితల జలాల తాజా స్థితిని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామన్నారు. చంద్రన్న బీమా కింద మృతుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని 15 రోజుల్లో ఇస్తున్నామన్నారు. తన విజయానికి కారణం, 23 ప్రభుత్వ శాఖలను ఒకే చోటకు చేరి, కన్వర్జెన్సుతో ఉపాధి నిధులు, విభాగల నిధులతో అమలు చేయడమేనని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలను ఈ-ప్రగతి కిందకు తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా, వేధింపులకు గురి కాకుండా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామన్నారు. డిజిటల్, వర్చ్యువల్ క్లాస్ రూమ్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రస్తుతం 793 సేవలు ఆన్‌లైన్‌లో అందుతున్నాయని, ప్రజలే ప్రథమం అన్న నినాదంతో రియల్ టైమ్ గవర్నెన్సు తీసుకువచ్చామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కాకపోతే 1100కు ఫోన్ చేస్తే, పరిష్కరించి, సంతృప్తి శాతం తెలుసుకుంటున్నామని వివరించారు.చివరి వ్యక్తికి కూడా సేవలు అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని, పౌరుల సంతృప్తే ధ్యేయమన్నారు.
ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో 73 శాతం సంతృప్తి వచ్చిందన్నారు. 100 ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ర్యాండమ్ సర్వే చేసి ప్రజల్లో సంతృప్తి శాతం తెలుసుకుంటున్నామన్నారు. ఈ ఫలితాలను ఆయా శాఖలకు అందచేసి, తమ పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 2020 నాటికి రాష్ట్రంలో 1.7 మిలియన్ల రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై బుధవారం తాను ప్రజెంటేషన్ ఇచ్చానని గుర్తు చేశారు. ఇప్పటికే 63 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు.