ఆంధ్రప్రదేశ్‌

చావే శరణ్యం.. దూకేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 27: ఉద్యోగాలు లేక ఏళ్ల తరబడి అర్ధాకలితో అలమటిస్తున్నాం... ఎంతకాలం తల్లిదండ్రులపై ఆధారపడాలి... ఇక మాకు చావే శరణ్యం... దూకేస్తాం... దూకేస్తున్నామంటూ దాదాపు 25 మంది నిరుద్యోగ పీఈర్‌టీ అభ్యర్థులు గురువారం సాయంత్రం విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశారు. దీంతో దాదాపు గంట సేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మ్తొంపై పోలీసులు నానా హైరానాపడి ఎట్టకేలకు వారందరినీ క్షేమంగా కిందకు దించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలంటూ ఏఐటీయుసి అనుబంధ ఆంధ్ర వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్‌కు ర్యాలీగా చేరుకుని కొంత సేపు ధర్నా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం కొందరు అక్కడున్న పోలీసుల కళ్లుగప్పి మున్సిపల్ స్టేడియంలోని వాటర్ ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది తెలుసుకుని సాయుధ పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. గంటకు పైగా ఉత్కంఠ అనంతరం వారందరినీ వాటర్‌ట్యాంక్ పైనుంచి పోలీసులు క్షేమంగా కిందకు దించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 1056 పీఈటీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడంతో 20 వేల మంది అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేసి అప్పటి వరకు చేస్తున్న చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు, ఇతర పనులు వదిలి శిక్షణ పొందారన్నారు. తీరా డీఎస్సీ అయిన తర్వాత 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, 30 శాతం అంటే కేవలం 30 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామనటంతో వీరి ఆశలు నీరుగారాయన్నారు.