ఆంధ్రప్రదేశ్‌

అందోళన వద్దు.. అర్హులందరికీ భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 27: యువనేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులెవరూ కూడా చిన్న చిన్న కారణాలతో ఈ పథకానికి దూరం కాకూడదని అధికారులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో యువనేస్తంపై గురువారం మంత్రి రవీంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అర్హులందరికీ అక్టోబర్ 2న బ్యాంక్ ఖాతాల్లో నిరుద్యోగ భృతి జమ చేస్తామన్నారు. విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణకు వివిధ వర్సిటీల వద్ద 30 వేలకు పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈకైవైసీ, తెల్లరేషన్ కార్డు, వయస్సు, భూమి, పీఎఫ్, కుటుంబ సభ్యుల్లో ఉద్యోగం వంటి ఫిర్యాదులు 18 వేలకు పైగా ఉన్నాయన్నారు. వీటిని 1100 ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కొందరికి కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ అందిందని, కానీ బ్యాంక్‌లు రుణాలు ఇవ్వలేదన్నారు. వీరు కూడా అనర్హులు అవుతున్నారని, పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ సాంకేతిక, ఇతర సమస్యల వల్ల పథకానికి దూరం కాకూడదన్నారు. నెలాఖరులోగా వేలాది దరఖాస్తులు రావచ్చని, పెండింగ్‌లో ఉన్నవన్నీ తక్షణమే పరిష్కరించాలన్నారు. కాగా, గురువారం సాయంత్రానికి 4.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 1.24 లక్షల మంది అర్హులుగా అధికారులు గుర్తించారు.