ఆంధ్రప్రదేశ్‌

ఏనుగుల సంచారంతో భయాందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 28: జిల్లాలో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించాయి. అప్పటి నుంచి వాటిని తిరిగి ఒడిశా అడవుల్లోకి పంపేందుకు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే మిగిలాయి. ఈ ఏనుగులను అతికష్టం మీద ఒడిశా అడవుల్లోకి తరలించినప్పటికీ, ఒడిశా అధికారులు వాటిని తిరిగి ఆంధ్రా వైపునకు మరల్చడంతో అవి వెనక్కి వచ్చేశాయి. దీంతో ఏనుగులను వెనక్కు తరలించడం ఎలాగా అని అటవీశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. శిక్షణ పొందిన ఏనుగులను రప్పిస్తే తప్ప ఈ ఏనుగులను పట్టుకోలేమని అధికారులు చెబుతున్నారు. ఏనుగులను పట్టుకునేందుకు శిక్షణ పొందిన ఏనుగులు కర్ణాటకలో ఉండటంతో అక్కడి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని డిఎఫ్‌ఒ లక్ష్మణ్ తెలిపారు. శిక్షణ పొందిన ఏనుగులను రప్పించి వాటిద్వారా ఈ ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఏనుగులు జిల్లాలోని కొమరాడ మండలం నందాపురం సరిహద్దులో తిష్టవేశాయి.
ఏనుగుల కథ సుఖాంతమైందని భావించినప్పటికీ అవి వెనక్కి రావడంతో గ్రామస్థులు, అధికారులు కలవరపడుతున్నారు. ఇప్పటికే ఏనుగుల సంచారంవల్ల జిల్లాలోని నాలుగు మండలాల్లో అరటి, చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. మరోపక్క ఇద్దరు యువకులు ఏనుగుల దాడిలో గాయాల పాలయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏనుగులను తరలించేందుకు అధికారులు నానాయాతన పడుతున్నారు. మరోపక్క ఏనుగులు ఎక్కడ ఉన్నాయన్నదీ జిపిఎస్ ద్వారా, ఏనుగుల ట్రాకర్ల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించడమొక్కటే శాశ్వత పరిష్కారమని డిఎఫ్‌ఒ లక్ష్మణ్ తెలిపారు.