ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల సమయంలో బీజేపీ కక్ష సాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: గత నాలుగేళ్లుగా చూస్తున్నానని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రధాని మోదీ ఎన్నో దేశాలు తిరిగి ఏమి సాధించారని ప్రశ్నించారు. రాఫెల్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని ధ్వజమెత్తారు. అసూయకు హద్దు ఉంటుందని హితవుపలికారు. అమెరికా పర్యటన అనంతరం ఆయన ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల అంశాన్ని విలేఖర్లు ప్రస్తావించగా, కేంద్రం పెద్ద దొంగలను పట్టుకోదని, రాజకీయానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తమిళనాడులో ఏం జరిగిందో, ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూశారన్నారు. ఒక్క రేవంత్ అంశమే కాదని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ ఇలానే చేస్తోందని విమర్శించారు. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, వ్యక్తులు,పార్టీలు హుందాగా వ్యవహరించాలన్నారు. మోదీ ఎన్నో దేశాలు తిరిగి దేశానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇస్తే, ఏం గుర్తింపు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ఏపీ రైతులు సాధించిన ప్రకృతి వ్యవసాయంపై ఐక్యరాజ్య సమితి గుర్తించిందని గుర్తు చేశారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని, ఎక్కడా ఇటువంటివి అమలు చేయలేదన్నారు. కేంద్రానికి ఏపీ అంటే అసూయ, కడపు మంట అని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపై అసూయతో ఆరోపణలు చేస్తున్నారని, ఐక్యరాజ్యసమితిలో భాగమైన సంస్థ ఆహ్వానిస్తే, అది ఐక్యరాజ్య సమితిలో భాగంగా కాదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఐక్యరాజ్య సమితి వేదికగా ఉగ్రవాదం, పాకిస్తాన్, జమ్మూకాశ్మీర్ వంటి సమస్యలను ప్రస్తావించారని గుర్తు చేశారు. కానీ ఒక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని ఈ వేదికపై ప్రస్తావించే అవకాశం దేశ చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. రాఫెల్ వ్యవహారంపై మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. భద్రతా అంశాల్లోనూ అవినీతా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా అంటూ ఏమి చేశారన్నారు. డిజిటల్ ఇండియాతో ఏపీ సాధించిన ఫలితాలతో బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీకి తాను సాధించిందేంటో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. టూరిజం, హౌసింగ్, ఉపాధి హమీ పథకం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్‌ల్లో ఏపీ ముందు ఉందని గుర్తు చేశారు. ఏపీని ఆ దిశగా ఎలా నెంబర్ 1గా తీర్చిదిద్దామో సవాల్ చేయగలనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏమి సాధించిందో వచ్చే అవార్డుల ద్వారానే తెలుస్తుందన్నారు. కేంద్రానికి ఇష్టం లేకున్నా, ఏపీకి అవార్డులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్రం పనితీరు జారి పోతుంటే, ఏపీ వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. 29 రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం గురించి వివరించే అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. మనం అమలు చేస్తున్న విధానాన్ని ప్రపంచం ఆదర్శంగా తీసుకుందని, దీనిపై కేంద్రం అసూయ పడుతోందని ఆరోపించారు. పసలేని ఆరోపణలను అసూయతో చేస్తున్నారన్నారు. వీళ్లు దొంగల్ని, నేరస్థులను పట్టుకోలేరని, సమర్థవంతంగా పని చేస్తున్నారిపైనే దాడి చేస్తారన్నారు. ఢిల్లీలో కూర్చుని రెండు ప్రెస్ కాన్ఫరెన్సులు పెడితే నాయకులు కాలేరని, వారికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం ఏపాటిదో ప్రజలకు తెలుసు అన్నారు. విశ్వసనీయతే తన బలమని, తన క్యారక్టరే తనకున్న ఆస్తి అన్నారు. ఒక అవినీతి పరుడు బురద జల్లితే అంటుకుంటుందా? అని ప్రశ్నించారు. జగన్‌ను ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు అవినీతి గురించి మాట్లాడిన మోదీ ఇప్పుడు ఏమి చేస్తున్నారన్నారు. మోదీపై ప్రజల్లో విశ్వసనీయత పోయిందని వ్యాఖ్యానించారు. ముందు నిజాయితీ అమలు చేశాకే, జనానికి చెప్పాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబితే, తనపై దాడు చేసేందుకు పూనుకుంటారా? అని ప్రశ్నించారు. 24 గంటలూ తనపై బురద జల్లడమే పని అని, అంతకంటే ఏం చేస్తున్నారని విమర్శించారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నారని, కోరితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. సమస్య ఉంటే చెప్పకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థను నమ్మాలన్నారు. నేర చరిత్రకు బలయ్యాం తప్ప, నేర చరితులను పార్టీలో ప్రోత్సహించలేదన్నారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని తానే నియంత్రించానన్నారు. నేరాలను ప్రోత్సహించడం టీడీపీ విధానం కాదన్నారు. రూపాయి విలువ పడిపోతోందంటూ దేశం అంతా గగ్గోలు పెడుతుంటే, వారికి వినిపించడం లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుపై ఏమి చేస్తారో వేచి చూద్దామన్నారు.