ఆంధ్రప్రదేశ్‌

మోదీ, షా తెలుగు ద్రోహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇరువురు తెలుగు ప్రజలకు ద్రోహులని, ఐక్యరాజ్యసమితిలో తెలుగు వాడికి గౌరవం దక్కితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈర్షా ద్వేషాలతో రగిలిపోతున్న మోదీ, షాలు కల్సి చంద్రబాబు ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వైవీబీ రోపించారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు శంకరగిరి మాన్యాలకు పోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఏపీ ప్రజలు సమాధి కట్టడం ఖాయమన్నారు. రాఫెల్ కుంభకోణం విషయంలో జగన్, పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీతో కుమ్మక్కు అయ్యారని చెప్పటానికి ఇదే నిదర్శనమన్నారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. పవన్ ఎవరో చెప్పింది వినటం కాదు.. వాస్తవాలు మాట్లాడలన్నారు. చింతమనేని సవాల్‌కు పవన్ సిద్ధమా అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చింతమనేనిపై పవన్ పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ నేతలపై పవన్‌కు ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. రాజకీయం అంటే గబ్బర్‌సింగ్ సినిమా కాదన్నారు. పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు. పవన్ బెదిరింపులకు టీడీపీ నేతలు భయపడరని అన్నారు. జనసేన, బీజేపీల బలంతో 2014లో గెలిచామనటం సత్యదూరమన్నారు. వాళ్లబలం లేకుండానే 2014 ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించామని రాజేంద్రప్రసాద్ అన్నారు.

రాష్ట్రానికి పట్టిన శని గ్రహం జీవీఎల్: బచ్చుల
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు రాష్ట్రానికి పట్టిన శనిగ్రహమన్నారు. జీవీఎల్‌కు బాబుని విమర్శించే నైతిక హక్కులేదన్నారు. విమర్శలు చేసే ముందు జీవీఎల్ ఆంధ్రుడా కాదో చెప్పాలన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో వేలకోట్ల అవినీతికి బీజేపీ పార్టీ పాల్పడిందన్నారు.