ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్‌లో పంటల బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 29: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయి రెండు సంవత్సరాలు కావస్తున్నా పరిహారం చెల్లించకుండా ఐసీఐసీఐ కంపెనీ తీవ్ర జాప్యం చేస్తున్నదని తక్షణం పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరిభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు ప్రభుత్వ జాతీయ పంటల బీమా సంస్థకు ప్రీమియం చెల్లించేవారన్నారు. ప్రటి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలపై చెల్లించే ప్రీమియం కంపెనీకి బ్యాంకుల ద్వారా జమయ్యేదన్నారు. కానీ 2015-16 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగానికి చెందిన బీమా సంస్థను పక్కనబెట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు. వీరు ప్రీమియం విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బ్యాంకులేకాకుండా వెలుగు అధికారులు సైతం వసూలు చేయడానికి అనుమతించడంతో వెలుగు అధికారులు ప్రీమియం వసూలులో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశాలు నిర్వహించి పంటల బీమాపై చర్చించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బీమా పరిహారం తక్షణం చెల్లించాలని, ప్రీమియం వసూలులో అక్రమాలకు పాల్పడిన వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.