ఆంధ్రప్రదేశ్‌

బాబు పొట్ట విప్పితే అబద్దాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాజ్యమేలుతుంటే చంద్రబాబునాయుడుకు ర్యాంకులు వస్తున్నాయని, అసలు కేంద్రం నుంచి మోదీ ఇచ్చిన నిధులు లేకపోతే ఈ పెత్తనమంతా ఎక్కడుంటుందోనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఒక అబద్ధాల పుట్ట అని, పొట్ట విప్పి మైక్రోస్కాప్‌తో చూస్తే అబద్ధాలే ఉంటాయన్నారు. ప్రధాని మోదీని విమర్శించకపోతే ఆయనకు రోజు గడవదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడారు. దేశంలో తానే సీనియర్‌నని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధాని మోదీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చంద్రబాబునాయుడు మాదిరిగా లేని పోని హడావిడి చేయడం మోదీకి అలవాటు లేదని, ఎన్నో దేశాలు తిరిగినా చంద్రబాబునాయుడులా ప్రచారం చేసుకోలేరన్నారు. మోదీని చూస్తే చంద్రబాబునాయుడుకు అసూయ, కడుపు మంట, కంటగింపు అన్నారు. ఒక బలహీనవర్గానికి చెందిన ఛాయ్‌వాలా ప్రధానా అని చంద్రబాబు సహించలేకపోతున్నారన్నారు. మోదీ గుజరాత్ సీఎం అయి ఒక రోల్‌మోడల్‌గా పనిచేయడంతో ప్రజలు ఆయనను ప్రధానిని చేశారని, ఎవరికీ లేనంత అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడును ప్రజలు ఎందుకు గుర్తించలేకపోయారని ఎద్దేవా చేశారు. మోదీ తల్లికి ఒంట్లో బాగోపోతే ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో వెళ్లి, తిరిగి వచ్చేటపుడు ఆటోలో తిరిగి వచ్చారని పేర్కొంటూ మోదీ గురించి, నీతి గురించి మాట్లాడే హక్కు, నైతికత చంద్రబాబునాయుడుకు లేదన్నారు. నైతికతకు మోదీ చిహ్నమైతే, చంద్రబాబు అనైతికతకు చిహ్నమని సోము విమర్శించారు. చంద్రబాబు మాత్రం ఆడంబరాలకు ప్రజాసొమ్ము కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కృష్ణా నది ఒడ్డున ఒక ఇల్లు, హైదరాబాద్‌లో మరో ఇల్లు, తాజాగా ఒక ఫార్మ్‌హౌస్ ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం, ఒక హోటల్‌లో మూడు సూట్‌లు, కాఫీకి రూ.250 వంతున రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్ల దగ్గర నుంచి ప్రభుత్వ ఇళ్ళు, గ్రామాల్లో వౌలిక సదుపాయాలు మెరుగు, అసంఘటిత రంగ కార్మికులకు బీమా, ఎల్ ఈడీ బల్బుల పంపిణీ ఇలా అన్నింటా కేంద్రం నిధులు ఇస్తుంటే, బహుమతులు గెల్చుకుంటూ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శించడం శోచనీయమన్నారు. రూ.4 లక్షలతో కట్టాల్సిన ఇళ్ల వ్యయాన్ని రూ.9 లక్షలకు పెంచేసి, ఇరవై ఏళ్ళ పాటు అప్పు తీర్చండి అంటూ పేదల ముఖాన అద్దె ఇల్లు పారేశారన్నారు. మోదీ సొంతింటి కలను, చంద్రబాబు అద్దె ఇంటికలగా మార్చారని ఎద్దేవా చేశారు. రాఫెల్‌పై రాద్ధాంతం తగదని, సాంకేతిక ప్రమాణాలతో అర్హత, సామర్ధ్యం కలిగిన సంస్థకే అప్పగించడం జరిగిందని వివరిస్తూ ఆయన ఒక వివరణ పత్రం ఇచ్చారు.

అర్బన్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకై త్వరలో దీక్ష
రాష్ట్రంలోని అర్బన్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తోందని, ఈ పోస్టుల భర్తీ కోసం, రెగ్యులైజేషన్ కోసం తాను త్వరలో నిరాహార దీక్షను దిగనున్నట్టు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, వాటిపై ఎక్కడికక్కడ ప్రస్తావన చేస్తూ రోజుకి రెండు మూడు గంటలు దీక్షకు దిగుతానని, అది రాజమహేంద్రవరం నుంచే ప్రారంభిస్తానని సోము వీర్రాజు పేర్కొన్నారు.