ఆంధ్రప్రదేశ్‌

తెనాలి మున్సిపాలిటీలో బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 29: తెనాలి పురపాలక సంఘంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా కౌన్సిలర్లు పరస్పరం దాడులకు దిగారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ముష్టి యుద్ధాలు జరిగాయి. ఉదయం 11గంటలకు మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా.. టీడీపీ కౌన్సిలర్ గౌసియాబేగం మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన వైసీపీ ఫ్లోర్ లీడర్ రామయ్య మాట్లాడుతూ గత సభలో జరిగిన విషయాలపై మళ్ళీ మాట్లాడటం సరికాదని వాదించటంతో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మద్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో వైసీపీ కౌన్సిలర్లను చైర్మన్ హెచ్చరించటంతో సమావేశం రాసాభాసగామారి చైర్మన్ తమ్ముడు, కౌన్సిలర్ పెండేల సుబ్బారావుపై వైసీపీ కౌన్సిలర్ల దాడి చేశారు. ఇరువర్గాల తోపులాట అనంతరం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మహిళా కౌన్సిలర్లు కూడా పాల్గొనటంతో సభలో యుద్ధవాతావరణం చోటుచేసుకుంది. హఠాత్తుగా జరిగిన ఈ దాడులతో అధికారులందరూ నిశే్చష్టులై కూర్చీలలో అలాగే కూర్చుండిపోయారు. బాహాబాహీ అనంతరం వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు తమకు న్యాయం చేయాలంటూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకొని పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఈలోగా రంగంలోకి వచ్చిన పోలీసులు ఇరువురిని వారించే ప్రయత్నం చేస్తుండగానే సభలో జరిగిన విషయం దావానలంలా టీడీపీ, వైసీపీ నాయకులకు చేరటంతో వారు మున్సిపల్ సమావేశ మందిరం వద్దకు చేరుకొన్నారు. ఇరుపార్టీల నాయకుల మధ్య కూడా తోపులాటలు, దాడులు జరిగాయి. ఈ సంఘటనలో వైసీపీ నేత కఠారి హరీష్‌ను సీఐ లక్ష్మణ్ చొక్కాపట్టుకుని లాగటంతో ఆయన చొక్కా చిరిగింది. అనంతరం సీఐ తన సిబ్బందితో ఇరువర్గాలను వారిస్తూ ఆప్రాంతం నుండి పంపివేశారు. బయటకు చేరుకున్న వైసీపీ కౌన్సిలర్లు నడిరోడ్డుపై బైటాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా టీడీపీ కౌన్సిలర్లు కూడా ధర్నాలకు దిగటంతో ఇరువర్గాల వారిని సర్దిచెప్పేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటం, విచారణ చేపడతామని సీఐ హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు.