ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛతే సేవలో 33 మందికి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 2: పరిసరాల పరిశుభ్రత - పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ గ్రామాల్లో కృషి చేస్తున్న 33 మందిని ప్రభుత్వం గుర్తించగా గాంధీ జయంతి రోజు మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వచ్ఛతే సేవ సభలో సీఎం చంద్రబాబు వారిని నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
స్వచ్ఛాంధ్ర అంబాసిడర్‌లు సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగశర్మ, జన శిక్షణ సంస్థాన్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ విద్యా కన్నా, జీవీ మూర్తి, ఉపాధ్యాయవర్గం నుంచి వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన బీ కవిత (శ్రీకాకుళం), ఏ లక్ష్మీలావణ్య (విజయవాడ), డీ కార్తికేయ (అనంతపురం), చిత్రలేఖర పోటీల్లో పీ మహేష్‌బాబు (కొత్తపట్నం, ప్రకాశం), ఎం జ్యోతికుమార్ (ఏలూరు), పీ శివ (ప్రొద్దుటూరు), వకృత్వ పోటీల్లో కే కారుణ్య (ప.గో), పీ శే్వత (పొందూరు), జీ రేణుక జాహ్నవి ( తమ్మయపాలెం - ప్రకాశం), ఉత్తమ పాఠశాలగా తూ.గో జిల్లా ఆదిత్య స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శృతిరెడ్డి, ఉత్తమ కళాశాలగా ప.గో జిల్లా సీఆర్‌ఆర్ కళాశాల అధ్యక్షులు కే రాంబాబు, ఉత్తమ విద్యార్థిగా కంచర్ల శాయిశ్రీహాస (ఆరో తరగతి - ప్రకాశం), రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో తిరుమలనగర్ కాలనీ అధ్యక్షులు నాగభూషణం (విజయవాడ), నంద్యాలకు చెందిన శివకుమార్‌లను సీఎం చంద్రబాబు సత్కరించారు.