ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 2: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఎందుకు నోరు మెదపటం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ప్రశ్నించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం సుమారు రెట్టింపు స్థాయిలో నిధులు రాబట్ట గలిగిందని రెండురోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన దినేష్‌కుమార్ చేసిన ప్రకటనను మంగళవారం ఐవైఆర్ తన ఫేస్‌బుక్ ఖాతాల్లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దినేష్‌కుమార్ వ్యాఖ్యలను ప్రస్తావించడం కన్నా పవన్ కళ్యాణ్ నియమించిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఐవైఆర్ స్వయంగా పరిశోధించి వెల్లడించిన నివేదికపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. విభజన చట్టం కింద కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం రూ. 75వేల కోట్లు అయితే ఇంత వరకు కేవలం రూ. 13,500 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఐవైఆర్ సభ్యుడిగా ఉన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెల్లడించిన విషయాన్ని ఆనందసూర్య గుర్తు చేశారు. ఇంకా రూ. 61,500 కోట్లు నిధులు రావాల్సి ఉండగా ఆ విషయంపైన ఐవైఆర్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, ఆంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారని ప్రశ్నించారు.
కేంద్రం సహాయ నిరాకరణ చేస్తునప్పటికీ, జగన్మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్ వంటి పదవీ కాంక్షాపరులు నిరాధార ఆరోపణలు చేస్తూ రాష్ట్భావృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నప్పటికీ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్న పోలవరానికి కేంద్రం సక్రమంగా నిధులు విడుదల చేయనప్పటికీ రికార్డు స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న చంద్రబాబుపైన అవాకులు చెవాకులు పేలడం కన్నా కృష్ణారావు తన పలుకుబడి ఉపయోగించి వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడానికి కృషి చేయాలన్నారు.