ఆంధ్రప్రదేశ్‌

రెండోరోజూ భక్తులకు కిరణ స్పర్శ భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 2: ప్రత్యక్ష నారాయణడు శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను మంగళవారం ఉదయం సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తాను పులకించిపోయానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సూర్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చిన ఆయన ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రఘవీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తొలిసారిగా ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించానని, ఎంతో పరవిశించిపోయారు. సూర్యకిరణాలు మూల విరాట్‌పై పడటాన్ని వీక్షించానని, ఇది తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలని అన్నారు. నరసన్నపేట మండలం, పోలాకి నుండి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని విభజన సమస్యలు తీరిపోతాయన్నారు. టీడీపీ, వైసీపీ చెరోవైపునుంచి బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతామన్న రాహుల్ గాంధీ హామీని రఘవీరారెడ్డి గుర్తుచేశారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్సీలు పీరుకట్ల విశ్వప్రసాద్, మజ్జిశారద, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, చౌదరి సతీష్ పాల్గొన్నారు.