ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగులను వంచిస్తున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 3: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను కారు షెడ్లకు.. పారిశ్రామిక వేత్తలను జైళ్లకు పంపిన ఘనత వైఎస్ కుటుంబానిదని తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తున్న నిరుద్యోగ భృతిపై మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి లేదని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం యువతకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని తెలిపారు. నాలుగేళ్లలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించలేని ఉపాధి అవకాశాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో టీడీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. నిరుద్యోగ భృతిపై జగన్ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం జగన్‌కు బహిరంగలేఖ రాశారు. మీ తండ్రి వైఎస్, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో లక్షా 5వేల పరిశ్రమలు మూతపడి 11లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వోక్స్‌వ్యాగన్ పరిశ్రమను పొరుగు రాష్ట్రాలకు తరలించి కమీషన్లు కాజేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను అవినీతి ఊబిలో దించి జైలుపాల్జేశారన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కారుషెడ్లలో పనిచేసే పరిస్థితులు కల్పించారని ఆరోపించారు. నిరుద్యోగ యువతను రెచ్చకొట్టి రాష్ట్రంలో అలజడి సృష్టించి పెట్టుబడులను అడ్డుకోవటం ద్వారా ఉపాధికి గండికొట్టేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, యువత ఈ కుట్రలను ప్రతిఘటించాలని కోరారు. యువతను వంచనకు గురిచేస్తున్న జగన్ తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ సర్కార్ నాడు నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ ఎందుకు విస్మరించారన్నారు. ఏపీ పీఎస్సీలో మీ బంధువుని నియమించి ప్రతిభకు గండికొట్టి అనర్హులను సబ్ కలెక్టర్లుగా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు వైసీపీ నేతగా ఉన్న నాటి కాంగ్రెస్ మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతి, బెదిరింపులకు వోక్స్ వ్యాగన్ కంపెనీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయింది వాస్తవమా.. కాదా.. అని నిలదీశారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన సత్యం కంప్యూటర్స్ భ్రష్టు పట్టటానికి వైఎస్ కుటుంబం బ్లాక్‌మెయిల్ ధన దాహమే కారణమని మండి పడ్డారు. సర్‌చార్జి పేరుతో మీ తండ్రి విద్యుత్ చార్జీలు పెంచిన ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు వీధినపడింది గుర్తులేదా అని ప్రశ్నించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు ఫీజు రీ యింబర్స్‌మెంట్ అంటూ ఆర్భాటపు ప్రచారంచేసి రూ 2500 కోట్లు బకాయిలుపెట్టి సంక్షోభానికి గురిచేసింది వైఎస్ అవునో కాదో తేల్చాలన్నారు. రక్తం అమ్మి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని 2004 మేనిఫెస్టోలో చేర్చి, నమ్మించి తరువాత వైఎస్ వంచించారని విమర్శించారు. మీ ధనదాహం, అవినీతి కారణంగా పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లు, విదేశీ పారిశ్రామికవేత్తలు జైళ్లపాలయింది తెలీదా అని నిలదీశారు. యువతను జగన్ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం నేరస్తులుగా మారుస్తూ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉండి కూడా ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని, తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు డీఎస్సీలతో ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా నిరుద్యోగ భృతి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తే యువతే తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.