ఆంధ్రప్రదేశ్‌

రాయలసీమ కరవుపై దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 4: రాయలసీమలో నెలకొన్న కరవుపై వామపక్షాల ఆధ్వర్యంలో త్వరలో దండయాత్ర చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కరవు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ పట్ల టీడీపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరవు మండలాలను ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. కరవు నివారణ చర్యలు ముందస్తుగానే చేపట్టడంలో వైఫల్యం చెందడంతో అనేక కుటుంబాలు వలస వెళ్లాయన్నారు. కరవు అధ్యయన బృందాలు సైతం ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక దందాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని అన్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోతోందన్నారు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు. నిరుద్యోగ భృతి అస్తవ్యస్తంగా తయారు కాగా అసలైన లబ్ధిదారులకు లభించడం లేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసంక్షేమం అంటూ ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు. అధికార పార్టీకి నూకలు చెల్లడం తథ్యమన్నారు. నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీని కలుపుకుని వామపక్షాలు ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తాయన్నారు. పెట్రోలు, డీజల్ ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందన్నారు.
రూపాయి ధర పడిపోవడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికంగా ఎంతో భారం పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతృత్వ పాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఢిల్లీలో రైతులు ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళనలు చేపడితే వారిపై లాఠీలు ఝుళిపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పేర పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఫలితంగా ప్రజలకు నష్టం కలుగుతోందన్నారు.