ఆంధ్రప్రదేశ్‌

బాబే బ్రాండ్ అంబాసిడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట/ఏర్పేడు, అక్టోబర్ 4: ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి బ్రాండ్ అంబాసిడర్ సీ ఎం చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామం వద్ద, రేణిగుంట ఐటీ హబ్ పరిధిలో రూ. 150 కోట్లతో డిక్సన్ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ ఉత్పత్తులను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ డిక్సన్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలో ఏడాదికి కోటి కెమేరాలు, 37 లక్షల ఎల్‌ఈడీ టీవీలు ఉత్పత్తి చేయనున్నారన్నారు. తొలి దశలో 800 మంది ఉద్యోగం చేస్తున్నారన్నారు. వీరంతా స్థానికులేనని వారి వారి అర్హతలు బట్టి డిక్సన్ సంస్థ యాజమాన్యం ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది టీడీపీ పాలనలోనే అన్నది అక్షర సత్యమన్నారు. సమైక్యాంధ్రలో సైబరాబాద్, హైటెక్‌సిటీ అభివృద్ధిపై సీ ఎం చంద్రబాబు నాయుడు దృష్టిసారించి ఎంత శ్రమ పడ్డారో దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. నాడు సైబరాబాద్ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎక్కడో.. సైబరాబాద్ అంటా.. రాళ్లు, రప్పల మధ్య భవనాలు కడుతున్నారంటా... వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయా అంటూ చంద్రబాబు నాయుడుని ఎంతోమంది ఎగతాళి చేశారన్నారు. అయితే చంద్రబాబు పట్టుదలతో సైబరాబాద్‌ను అభివృద్ధి చేశారని అన్నారు. ఇది చూసి విమర్శకుల నోళ్లు మూతపడ్డాయన్నారు. నేడు ఆరు లక్షల మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారన్నారు. ఒక పని ప్రారంభించినప్పుడు వాటి ఫలితాలు కాలగమనంలో తెలుస్తాయన్నారు. నేడు నవ్యాంధ్రప్రదేశ్‌లో సీ ఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా అలాంటివేనన్నారు. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా ఉన్నాయో అదే స్థాయిలో నేడు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు నేడు వస్తున్నాయన్నారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలంటే నోయిడా వైపు చూసేవారని అన్నారు. నేడు తిరుపతి వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల తాను ఏడు రోజులపాటు చైనాలో పర్యటించానని పరిశ్రమలు ఇండియాలో ఏర్పాటు చేయాలని కోరినప్పుడు తిరుపతి ఎక్కడ ఉంది అని అడిగే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించే సమయానికి రాష్ట్రంలో ఫోన్లు తయారీ సంఖ్య శూన్యమన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలో 26శాతం ఫోన్లు తయారీ ఏపీలో జరుగుతున్నాయన్నారు. దేశంలో 100 ఫోన్లు తయారవుతుంటే ఏపీలో 26 ఫోన్లు తయారు చేసే స్థితిలో ఉన్నామని ఈ ఘనత చంద్రబాబు నాయుడిదే అన్నారు.
మనకు బ్రాండ్ అంబాసిడర్‌లు ఎవరూ అవసరం లేదని, మనకు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడేనన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఏపీ నుంచి వచ్చానని చెప్పగానే చంద్రబాబు రాష్టమ్రా అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇనాళ్లుగా రాష్ట్రానికి 100 పరిశ్రమలు వస్తే గొప్పని భావించానని చైనా పర్యటన తరువాత 100 కాదు 1000 పరిశ్రమలు ఒక్క తిరుపతిలోనే తీసుకురావచ్చనే ఆత్మవిశ్వాసం తనలో పెరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోను రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఒక్క తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ సంస్థలో 60వేల మందికి ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మనకు మంచి ముఖ్యమంత్రి ఉన్నారని అది అదృష్టమని, అలాగే మన దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష పార్టీ ఉందన్నారు. బాబువస్తే జాబ్ రాలేదని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని అలాంటి వారికి తాను చెప్పేది ఒక్కటేనన్నారు. ఒక్కసారి పరిశ్రమల వద్దకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువతను ముఖ్యమంత్రిని గురించి ఆరాతీస్తే వారు సవివరంగా తెలియజేస్తారని, అప్పటికైనా వారికి జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నానన్నారు.
ఇదిలా ఉండగా 2014 వరకు రేణిగుంటలో పాత విమానాశ్రయం ఉండేదని నేడు దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడన్నారు. చిత్తూరు జిల్లాకు పరిశ్రమలు రావడమే గగనమని అందులోను తిరుపతిలో పరిశ్రమలు ఏర్పాటు సాధ్యమా అనే పరిస్థితి ఉండేదన్నారు. నేడు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సీ ఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పరిసరాలను పరిశ్రమలతో నింపేస్తున్నారని మనమంతా ఆయనకు అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు అచ్చం నాయుడు, అమరనాథ రెడ్డి, ఎంపీ డాక్టర్ శివప్రసాద్, డిక్సన్ కంపినీ అధినేత సునీల్ వాచాని, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.