ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో భారీగా పైపులైను వంట గ్యాస్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 4: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో పైపులైను ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)ను సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గ్యాస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగర ప్రజలకు కొంత కాలంగా పైపులైన్ ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే ఈ కనెక్షన్ల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు నగరంలో గ్యాస్ కనెక్షన్లను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు భాగ్యనగర్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ-ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది.
సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం కాకినాడ వాకలపూడిలో భాగ్యనగర్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ మదర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసింది. కాకినాడ నగరం కేంద్రంగా పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం పట్టణాల ప్రజలకు ఇంటింటికీ పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) కంటే తక్కువ ధరకు సీఎన్‌జీ లభిస్తుందని, సీఎన్‌జీ వాడకం వలన ప్రమాదాలకు ఆస్కార ఉండదని అప్పట్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేసింది.
ప్రారంభంలో ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగడం, సీఎన్‌జీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో గ్యాస్ ప్రాజెక్టు చాలా కాలం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగింది. గత రెండు, మూడేళ్లలో కాకినాడ నగరంలో ఇంటింటికీ వంటగ్యాస్ పైపులైన్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం పట్టణాలకు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రాకపోయినా కాకినాడ నగరంలో మాత్రం ఇటీవలి కాలంలో విజయవంతంగా నడుస్తోంది. నగరంలో ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసం సుమారు 17వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో 14వేల 172 గృహాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. కనెక్షన్ ఇచ్చిన గృహాలకు విద్యుత్ మీటరు తరహాలో ఓ మీటరు అమరుస్తారు. వినియోగదారుడు వాడే గ్యాస్ పరిమాణం మీటర్‌లో రికార్డు అవుతుంది. మీటర్ రీడింగ్ ఆధారంగా వినియోగదారులకు ప్రతినెలా బిల్లు అందజేస్తున్నారు. కాకినాడ నగరంలో ఉన్న గృహాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకూ ఇచ్చిన కనెక్షన్లు చాలా తక్కువ కావడంతో ఇక నుండి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మార్కెటింగ్ వ్యవస్థను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణలో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు.
కాకినాడ నగరంలోని 50 డివిజన్లలో ఈ వారోత్సవాలు నిర్వహించి, డివిజన్‌కు కనీసం 500 నుండి 600 గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇటీవలి కాలంలో నగరంలో అపార్ట్‌మెంట్లు అధికంగా నిర్మాణం అవుతున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్లు, బిల్డర్ల సంఘాలతో చర్చించి పెద్ద ఎత్తున వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.