ఆంధ్రప్రదేశ్‌

మహిళా సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 4: ఆడబిడ్డలను తోబుట్టువులుగా భావించే ఏకైన పార్టీ తెలుగుదేశమని, డ్వాక్రా సంఘాలను ప్రారంభించి మహిళల ఆర్థిక పురోగతికి తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిచ్చిందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది డ్వాక్రా సైన్యం ఉన్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పరిటాల మాట్లాడుతూ లోటుబడ్జెట్‌లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో డ్వాక్రా మహిళకు 10 వేల రూపాయల చొప్పున పసుపు-కుంకుమ కింద ఇస్తున్నామన్నారు.
ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ అంగన్‌వాడీ వర్కర్ల వేతనాన్ని పెంచామని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ, బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో రాయలసీమ ప్రాంతంలో జరిగిందని చెప్పారు.
జగన్, కన్నా లక్ష్మీనారాయణలు ఒకసారి రాయలసీమ ప్రాంతానికి వచ్చి చూస్తే తాము చేసిన అభివృద్ధి కనపడుతుందని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రైతు రుణమాఫీ జరిగింది అనంతపురం జిల్లాలోనేనని డ్వాక్రా రుణమాఫీ జరిగింది సైతం రాయలసీమలోనేనని తెలిపారు.
వైఎస్ హయాంలో హత్యలు, అల్లర్లతో రాయలసీమకు చెడ్డపేరు తీసుకువచ్చారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దివంగత ఎన్‌టిఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుండే ప్రారంభిస్తారని గుర్తుచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని నిలదీశారు. రాయలసీమ అభివృద్ధి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు సమగ్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, తల్లి, పిల్లకాంగ్రెస్, బీజేపీలను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి సునీత పేర్కొన్నారు.