క్రైమ్/లీగల్

తిరుచానూరు సమీపంలో రిటైర్డ్ జడ్జి దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 5: తిరుచానూరు సమీపంలోని కమలగిరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత న్యాయమూర్తి సుధాకర్ (62) రేణిగుంట మార్గమధ్యంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య వరలక్ష్మి మరో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం తిరుపతిలో జరిగింది. రైల్వే డీఎస్పీ రమేష్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కమలగిరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ న్యాయమూర్తి సుధాకర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 నుంచి 1 గంట మధ్య తిరుపతి-రేణిగుంట మధ్య వెళ్లిన రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే సీఐ ఆశ్వీరాదంకు సమాచారం అందింది. తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన ముందు గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు. ఆ తరువాత ఆధారాలు సేకరించగా మృతుడు విశ్రాంత న్యాయమూర్తి సుధాకర్‌గా గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆయన సతీమణి వరలక్ష్మి తన భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భర్త ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకుని సీఐ ఆశీర్వాదం సంఘటనా స్థలానికి చేరుకుని వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. సుధాకర్ దంపతులకు సందీప్ అనే కుమారుడు ఉన్నాడు.
ఆయన బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా, కుమార్తె సబిత కూడా ఉందని డీఎస్పీ తెలిపారు. ఇదిలావుండగా, సుధాకర్ 2014వ సంవత్సరం వరకు మహబూబ్‌నగర్‌లో అదనపు జిల్లా జడ్జిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.