ఆంధ్రప్రదేశ్‌

2022లో గగన్‌యాన్ ఇస్రో లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 10: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఆ దిశగా అంతిరక్ష ప్రయోగాలు చేపట్టడమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లక్ష్యమని షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎం.బద్రినారాయణ మూర్తి అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో అంతరిక్ష నడక (స్పేస్‌వాక్) నిర్వహించి డీఆర్‌డీఎల్ కాలనీలో విద్యార్థులకు అవార్డుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన బిఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోది స్పేస్ టెక్నాలజి పై ఎక్కువ దృష్టిసారించారన్నారు. ప్రధాని అభిష్టం మేరకు ఇస్రో ఆధునిక శాస్తస్రాంకేతికతను అందిపుచ్చుకొని 2022లో షార్ కేంద్రం నుంచే గగన్‌యాన్ చేపట్టడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రతి సామాన్యుడికి తెలియజేసేందుకు ఈ వారోత్సవాలును 1992నుంచి ప్రతియేటా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ సారి 5రాష్ట్రాల్లో 12చోట్ల నిర్వహించి విద్యార్థులకు అంతరిక్ష ప్రయోగాలు, వాటి ఉపయోగాలు తదితర అంశాల పై పూర్తిస్థాయిలో అవగాహనకల్పించామన్నారు. భవిష్యత్ తరాలు శాస్తస్రాంకేతిక రంగాల పై దృష్టిపెట్టాలన్నారు. విద్యార్థులు ప్రాథమిక దశనుంచే శాస్త్ర సాంకేతిక రంగాల పై అవగాహన పెంచుకొంటే మంచిదన్నారు. దేశ భవిష్యత్‌లో యువతే కీలకపాత్ర, ప్రతి ఒక్కరే ఏదో ఒక రంగంలో రాణించి దేశాభివృద్ధికి తనవంతు దోహదపడాలని సూచించారు.
అంతేకాకుండా నేడు సమాజంలో అభ్యున్నత స్థాయికి ఎదగాలంటే అంతర్జాల సదుపాయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ఇస్రోలో పనిచేసి రాకెట్లను అంతరిక్షంలోకి పంపించే వారు కూడా సామాన్య విద్యార్థి దశనుంచి వచ్చినవారేనని పట్టుదల కృషితే వారిని ఆదర్శంగా తీసుకొంటే మీరు కూడా అంతరిక్షంలో మానవులను పంపించే స్థాయిక ఎదగవచ్చునని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో పంపించే ఉపగ్రహాలు పనితీరు భాగా ఉందని దీనికి నిదర్శనం మనం ఈ రోజు ఇంటివద్ద నుంచే ప్రపంచం నలుమూలల జరిగే వాటిని టీవీల, సెల్‌ఫోన్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నామంటే అవి ఉపగ్రహాల అందిస్తున్న సేవలన్నారు. టెలివిజన్, టెలీమెడిసిన్, కమ్యూనికేషన్, వాతావరణం వివిధ సేవలు ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాల ద్వారానే అందుతుందన్నారు. దేశంలో నేడు భూసార పరీక్షలు, సముద్రంలో మత్స్యకారుల కదలికలు, తుఫాన్ వంటి ప్రభావలను ముందస్తు తెలుసుకొనేందుకు ఉపగ్రహాలు ఎంతగానో దోహపడుతుందన్నారు.
ఇలాంటి అంతరిక్ష ప్రయోగాల ఫలాలు సామాన్యుడి మానవుడికి సైతం అందుతున్నాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో సామాన్యులు వాడుతుతన్న సెల్‌ఫోన్, టీవీలు, భూసార పరీక్షలతో వివిధ రకాల వస్తువుల సేవలన్ని ఉపగ్రహాల అందిస్తున్న అవి వారికి పూర్తిస్థాయిలో తెలియడం లేదన్నారు. అందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాలు, వారి పంపించే ఉపగ్రహాల పనితీరు వాటి సేవలను సామాన్యుడి పూర్తిస్థాయిలో తెలుసుకొనేందుకే షార్ ఆధ్వర్యంలో అంతరిక్ష వారోత్సలు నిర్వహించి వాటి గురించి పూర్తిస్థాయిలో తెలిజేసే విధంగా చేస్తున్నామన్నారు.
అనంతరం ఆయన వారోత్సవాల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో షార్ డిప్యూటి డైరెక్టర్ వెంకట్రామన్, షార్ వారోత్సవాల కమిటి చైర్మన్ కెఎం రెడ్డి, ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ టి.శ్రీనివాసుల రెడ్డి, సభ్యులు వీవీఎస్ శ్రీనివాస్, రమేష్ రెడ్డి, కృష్ణారెడ్డి,సూళ్లూరుపేట తహశీల్దార్ అద్దంకి శ్రీనివాసరావు పాల్గొన్నారు.