ఆంధ్రప్రదేశ్‌

మోదీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 13: దేశంలో నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని కళాశాలలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నరేంద్రమోదీ నియంతృత్వ పాలనలో దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మోదీ తెలివి తక్కువ ఆర్థిక విధానాల వల్ల రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయిందని, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు అసహనంతో తిరుగుబాటు ధోరణి వస్తోందన్నారు. మోదీ విధానాలతో దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్నారు. ఒకపక్క అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన హక్కుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి నిర్మాణం, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అన్నీ పక్కన పెట్టి నిధులు మంజూరు చేయడం లేదన్నారు. వెనుకబడిన జిల్లాకు ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకునే స్థాయికి కేంద్రం దిగజారిపోయిందన్నారు. విభజన హామీల కోసం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పోరాడుతుంటే ఆదాయపన్ను శాఖ దాడులతో వారిని భయబ్రాంతులను చేసి నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారని, తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఇటువంటి ప్రభుత్వాన్ని ముందెన్నడూ చూడలేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రకు 350 కోట్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం మరలా వాటిని తిరిగి వెనక్కి తీసేసుకుందన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వెనక్కి తీసుకోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పోరాడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. మోదీ నియంతృత్వ పాలన నుంచి బయటపడాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు మరలా వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే రాష్ట్రం పరిస్థితి అత్యంత దుర్భరమవుతుందన్నారు. చంద్రబాబు అహర్నిశలూ కష్టపడి విదేశాలకు వెళ్లి నిరుద్యోగుల కోసం పరిశ్రమలు తీసుకువస్తున్నారని, రాజధాని అమరావతి నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అహోరాత్రులు కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అమరావతిని తీసుకువెళ్లి ఇడుపుల పాయలో పెట్టి తన అవినీతిని ఇంకా పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆదరణ లేకుండా జగన్ చేస్తున్న పాదయాత్ర పవిత్రమైనదికాదని, ఆ పాదయాత్ర కేవలం విహారయాత్రలా ఉందని డాక్టర్ శివాజీ విమర్శించారు.

పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: కారెం
ముఖ్యమంత్రి ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కారెం శివాజీ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాము ముందుకుపోతున్నానని డాక్టర్ శివాజీ చెప్పారు. తాను ఎక్కడి నుండి పోటీ చేసేదీ పార్టీ నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో కమిషన్ చొరవచూపుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అయిన ఏడాదిన్నరలో 10 వేల కేసులు ఉంటే 8వేల కేసులు పరిష్కరించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల భూములు అన్యాక్రాంతమైతే సహించేది లేదన్నారు. వారి భూములు అన్యాక్రాంతమైనా, ఆక్రమణకు గురైనా, ఎవరైనా కొనుగోలు చేసినా కమిషన్ విచారించి తిరిగి వారికే అప్పగిస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కమిషన్ పర్యటించిందన్నారు. కులాంతర వివాహాల్లో ప్రాణహాని ఉంటే సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారికి రక్షణ కల్పిస్తారని చెప్పారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం రూ. 75వేలు పారితోషికం ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.