ఆంధ్రప్రదేశ్‌

తీరం దాటిన వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబంగ తీరంలో బాలాసూర్-డిజా మధ్య శనివారం సాయంత్రం తీరం దాటినట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది క్రమంగా బలహీన పడుతూ అల్పపీడనంగా కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 50 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాయుగుండ ప్రభావంతో అన్ని ప్రధాన పోర్టుల్లోను శనివారం ఏగురవేసిన ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను తొలగించారు. వాయుగుండ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 15 సెంమీ వర్షపాతం నమోదైంది. సోంపేట, మందస 12 సెంమీ, టెక్కలి, పాతపట్నం 11 సెంమీ, ఇచ్ఛాపురం 10 సెంమీ, విశాఖ జిల్లా అరకు 9 సెంమీ, చింతపల్లి 8సెంమీ, పాడేరు, పాలకొండ, కళింగపట్నంలో 7 సెంమీ వర్షపాతం నమోదైంది.