ఆంధ్రప్రదేశ్‌

దమ్ముంటే ఢిల్లీలో బంద్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 24: రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపిస్తోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బంద్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయని, నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు.. వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించటమే వైసీపీ ప్రధాన అజెండా అన్నారు. విభజన చట్టంలో అంశాలు అమలు చేయకుండా ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని, ఎంపీలతో రాజీనామా చేయించి లోక్‌సభ అనే వేదికను వైసీపీ కోల్పోయిందని విమర్శించారు.
అవిశ్వాసంపై ఓటింగ్‌లో పాల్గొనకుండా బీజేపీకి మేలుచేసింది వైసీపీయే అన్నారు. రాష్ట్రానికి నష్టంచేసింది కాక బంద్‌తో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రానివ్వకుండా అశాంతిని ప్రేరేపించి పెట్టుబడులను అడ్డుకునే కుట్రలో భాగంగానే బంద్‌కు పిలుపునిచ్చారని మండిపడ్డారు.
ఢిల్లీ నుంచి పరారై వచ్చి బంద్ పాటించటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జగన్‌కు దమ్ముంటే ఢిల్లీ బంద్ నిర్వహించాలని సవాల్ విసిరారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ వైకాపా చేపట్టిన బంద్‌ను ప్రజలు తిరస్కరించారని, ప్రజల్లో వారికి ఆదరణ లేదని మరోసారి రుజువైందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య అన్నారు. మంగళవారం తిరుపతిలో వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారన్నారు. మోదీ ఎన్నికలకు ముందు వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారన్నారు. పైకి ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ, కేసుల నుంచి బయటపడేందుకు తీవ్రంగా ఆరాటం చెందుతున్నారని చెప్పారు. వర్లరామయ్య మాట్లాడుతూ జగన్, పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బాబు పాలన భేష్ అన్న పవన్ కల్యాణ్ ఆ తరువాత బాగా లేదనడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బీజేపీ నుంచి భారీగా ముడుపులు అందిన తరువాతే పవన్ మాటతీరు మారిందన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ ఎక్కడా బంద్ చేసిన దాఖలాల్లేవని, దీనిని బట్టి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అర్థమవుతోందని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు దొరబాబు, పోతుల సునీత, ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.