ఆంధ్రప్రదేశ్‌

బలిదానాలు జరిగినా కేంద్రం మనసు కరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 9: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఏపీలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్)లోని పెట్టుబడులను కేంద్రం వెనక్కి తీసుకుంటోందని శుక్రవారం ట్విట్టర్‌లో లోకేష్ ఆరోపించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటు పరం చేయవద్దు అని ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఒక ఉద్యోగి ఆత్మహత్య సైతం చేసుకున్నారని గుర్తు చేశారు. సంస్థ పరిరక్షణ కోసం ఉద్యోగులు బలిదానాలు చేసుకుంటున్నా కేంద్రం మనస్సు కరగడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటు పరం చేయవద్దని ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నా కేంద్రంలో కనీస చలనం లేదన్నారు. డీసీఐఎల్‌లో ఉన్న 73.44 శాతం పెట్టుబడులను వెనక్కితీసుకోవాలనే నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులను ప్రధాని మోదీ రోడ్డున పడేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం వేలాది మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని లోకేష్ ప్రశ్నించారు.