ఆంధ్రప్రదేశ్‌

కొనసాగిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, జూలై 30: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహాన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 224వ రోజైన సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం వీరవరం నుండి ప్రారంభమైన యాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రమాంపల్లి, దివిలి మీదుగా, పిఠాపురం నియోజకవర్గంలోని విరవ వరకు కొనసాగింది. పాదయాత్ర ప్రారంభమైన వీరవరం గ్రామం ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం స్వగ్రామం కావడం విశేషం. పాదయాత్ర ప్రారంభ శిబిరం వద్ద ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలికారు. పాదయాత్ర నిర్వహించిన జగన్‌కు పలువురు తమ తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, ఇళ్ల స్ధలాలు, రుణాలు తదితర సమస్యలపై జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. ముందుగా జనసేన పార్టీకి చెందిన కొంత మంది జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మండలంలోని రాజుపాలెం చేరుకున్న పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రమాంపల్లి చేరుకుంది. ఈకార్యక్రమంలో జగ్గంపేట నియోజకరవ్గ కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు, పార్టీ నేతలు ఒమ్మి రఘురామ్, కట్టమూరి బంగారం పిఠాపురం వైసీపీ కో-ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు, కురుమళ్ల రాంబాబు, గండేపల్లి బాబి, నడికట్ల చింతలరావు జగన్ వెంట ఉన్నారు.