ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్) జాతీయ వైస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందని, పార్టీల పరంగా ఆలోచిస్తే అభివృద్ధి జరగదన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయని, ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు అడిగితే టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఇలా అయితే జాతీయ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, నరేగాకు కేంద్రం ఇచ్చిన 12 వేల కోట్లను ప్రభుత్వం వాడుకుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలను, అభివృద్ధి కార్యక్రమాలను వేరుగా చూడాలన్నారు.
రాష్ట్రాల్లో యువతీ యువకుల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించేందుకు 620 జిల్లాల్లో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద కార్యక్రమాలను చేపడుతున్నామని, రాష్ట్ర యువజన క్రీడల మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో నెహ్రూ యువకేంద్రం తరపున త్వరలో భారీ ఈవెంట్‌లు నిర్వహించనున్నామని, అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర యువజన శాఖ నుండి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకువస్తానని, త్వరలో ఎన్‌వైకెఎస్‌లో కేంద్రప్రభుత్వ నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్లపాటు సీబీఐపై విమర్శలు చేయని చంద్రబాబు నేడు ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సీబీఐను అవమానిస్తే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను అవమానించినట్లేనన్నారు. సీబీఐను నిరోధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం