ఆంధ్రప్రదేశ్‌

అనుభవం ఉండీ.. తప్పులో కాలేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, తప్పులో కాలేశారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవక ముందు చంద్రబాబును, ఆంధ్రా నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ తిట్టారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు సంవత్సరాల తరువాత కూడా తిట్టడమే అజెండాగా పెట్టుకుంటే ప్రజలు క్షమించరన్నారు.
ప్రజలను అమాయకులను చేసి, తిట్లతో సెంటిమెంట్ రెచ్చగొట్టి గతంలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమి చేశారో, భవిష్యత్‌లో ఏమి చేస్తారో చెప్పాలని హితవు పలికారు. కేసీఆర్ స్థాయి నాయకుడు తాను ఓడిపోతే ఫామ్ హౌస్‌లో కూర్చుంటానని అనటం తగదన్నారు. ఓడిపోతే ప్రజలను, పార్టీని, కార్యకర్తలను గాలికి వదిలేస్తాననే నాయకుడిని చరిత్రలో ఎక్కడా చూడబోమని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో అలా చెప్పిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని వ్యాఖ్యానించారు. ముందుస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో తెలియదని, తీరా ఇప్పుడు ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో కూర్చుంటాననడం నవ్వోస్తోందన్నారు. గెలిస్తే ముఖ్యమంత్రిగా పదవి అనుభవిస్తానని, లేకుంటే పార్టీ కార్యకర్తలను అడవులు, రోడ్ల పాలు చేస్తానని, తాను మాత్రం ఫామ్ హౌస్‌లో కూర్చుని ఎంజాయ్ చేస్తాననటం తగదన్నారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన సంవత్సరం పాటు సచివాలయానికి రాకుండా ఫార్మ్ హౌస్‌లోనే గడిపారని ఆరోపించారు. కేసీఆర్ మాటలకు విలువ ఉందా అని ప్రశ్నించారు. చెప్పిన హామీలు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. వైకాపా అధినేత జగన్ కూడా ఇదే విధానం అవలంబిస్తున్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే సభ్యులు అసెంబ్లీకి రావాలంటారని, ఆయన ముఖ్యమంత్రి కాలేదు కనుక అసెంబ్లీలో, లోక్‌సభలో ఎవరూ ఉండకూడదనేనది ఆయన విధానం అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, జగన్‌కు తేడా లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటిస్తే, జగన్‌కు అంత నొప్పి ఎందుకన్నారు. జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఇతర పార్టీలు చెప్పినప్పటికీ చెప్పినప్పటికీ, అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేయడం బీజేపీ అధికార దాహానికి పరాకాష్టగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ఆరోపించారు. బీజేపీ పతనం అంచున ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు.