ఆంధ్రప్రదేశ్‌

రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్రంలో రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీవో)ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో రైతు ప్రగతి, ఎప్‌పీవోల రాష్ట్ర స్థాయి వర్కుషాపును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌పీవోలను నాబార్డ్ ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై శ్రద్ధ వహించి అన్ని రకాల సాయం అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పంట దిగుబడులను, మార్కెటింగ్ పరిధిని, ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో రాష్ట్రం 17.16 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి హార్టికల్చర్ ద్వారా 42,400 కోట్ల రూపాయలు వస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి రేటు నమోదు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని రానున్న 5 సంవత్సరాల్లో కోటి ఎకరాలకు విస్తరించటం లక్ష్యమని, ఈ ఏడాది 6 లక్షల ఎకరాలను ఉద్యాన పంటల పరిధిలోకి తీసుకువచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఎఫ్‌పీవోలకు పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కింద 385 కోట్ల రూపాయల విలువ చేసే 19 ప్రాజెక్టులను ప్రతిపాదించామన్నారు. ఉద్యాన రంగానికి సంబంధించిన ఎఫ్‌పీవోలకు ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల లైసెన్సులను వాటికి జారీ చేయాలని అధికారురులను ఆదేశించారు. ఎఫ్‌పీవోలు వ్యవస్థీకృతం కావాలని, ఉత్పత్తుల వారీగా ఎఫ్‌పీవోల ఏర్పాటు అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు వీలుగా అగ్రివాచ్‌ను ప్రారంభించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు మారాల్సి ఉందన్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు 5 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వ సాయం ఉంటుందని, కానీ టెక్నాలజీ, మారుతున్న పరిణామాలను రైతులు గమనించాల్సి ఉందన్నారు. కాలానుగుణంగా డిమాండ్ ఉండే పంటలు వేయాలని సూచించారు. ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ మార్కెట్ లింకేజీ పెంచి, పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఎఫ్‌పీవో పని చేస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిపైనే దృష్టి పెట్టకుండా, ఎఫ్‌పీవోలను బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను నిరంతర సరఫరా, నాణ్యత ఉంటేనే తీసుకుంటాయన్న విషయాన్ని గమనించాలన్నారు. చిత్తూరు జిల్లాలో 10 చోట్ల రైతుల కోసం కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కోల్డ్ స్టోరేజీ, వంటివి ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయన్నారు. ఎఫ్‌పీవోలకు చేయూత ఇచ్చి వాటిని స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఏడు కంపెనీలతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందాలు చేశామన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో 100 ఎఫ్‌పీవోలకు ఈ కంపెనీలు చేయూత ఇస్తాయన్నారు. ఒక్కో ఎఫ్‌పీవో కోటిన్నర రూపాయల వరకూ ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాయన్నారు. నాబార్డ్ సీజీఎం సురేష్ కుమార్, జనరల్ మేనేజర్ ప్రభాకర్, అంధ్రాబ్యాంక్ సీజీఎం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.