ఆంధ్రప్రదేశ్‌

రెండు కిలోమీటర్లకు పరిమితమైన పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, ఆగష్టు 2: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా గొల్లుప్రోలు మండలంలో గురువారం రెండు కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం పాదయాత్ర ముగించిన జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. మండలంలోని తాటిపర్తి జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి బసచేసిన ప్రాంతం నుండి గురువారం ఉదయం 8.40 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభించారు. చెందుర్తి క్రాస్ రోడ్స్ వద్దకు చేరుకోగానే ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు స్వాగతం పలికారు. వీరికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా మహిళలు జగన్ కలవడానికి ముందుకు రావడానికి ప్రయత్నించారు. అయితే వీరిని జగన్ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు..గంటల తరబడి వేచి చూస్తున్న తమను జగన్‌ను కలవనివ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది గమనించిన జగన్ భద్రతా సిబ్బందిని వారించడంతో మహిళలు జగన్‌ను కలసి సెల్ఫీలు తీసుకున్నారు. స్థానిక సమస్యలను వివరించారు. వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆద్వర్యంలో పలువురు కాపు మహిళలు జగన్‌ను కలసి కాపు కార్పోరేషన్‌కు 10 వేల కోట్లు మంజూరుచేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. అనంతరం చేబ్రోలు ముఖద్వారం సమీపంలోని రైసుమిల్లు వద్దకు చేరుకుని పాదయాత్రను ముగించారు. శుక్రవారం కోర్టుకు హాజరుకావలసి ఉన్నందువల్ల ఆయన హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. శనివారం ఉదయం నుండి పాదయాత్ర యథావిథిగా కొనసాగుతుందని వైసీపీ నాయకులు తెలిపారు.
జగన్ వెంట వైసీపీ నేతలు పెండెం దొరబాబు, కొప్పన మోహనరావు, కురుమళ్ల రాంబాబు, మొగలి బాబ్జీ, బుర్రా అనుబాబు, మొగలి అయ్యారావు, గండేపల్లి బాబి, తెడ్లపు చిన్నారావు, మొగలి సాంబశివ, దాసం లోవబాబు, పర్ల రాజా, కుర్రే శంకర్ తదితరులున్నారు.