ఆంధ్రప్రదేశ్‌

అందరికీ ఆరోగ్యం కాంగ్రెస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ రోగులు ఇబ్బంది పడుతున్నారని, తమిళనాడు నుంచి ఆంధ్రరాష్ట్రం విభజన తరువాత నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలకు 30 సంవత్సరాల పాటు మద్రాసులో ఉచితంగా వైద్యాన్ని అందించిన సంగతిని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజానాథ్ గుర్తు చేశారు. గురువారం ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొండ్రు మురళి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రాజాతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ దేశంలో అందరికీ ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని, ఆ లక్ష్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని శైలజానాథ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద ఆంధ్రప్రదేశ్ వైద్య చరిత్రలో తొలిసారిగా కార్పొరేట్ ఆసుపత్రిలో సామాన్య మానవుడు అడుగుపెట్టి వైద్యాన్ని పొందిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, గృహనిర్మాణాలను సంతృప్త స్థాయిలో అమలు చేశామన్నారు. ఇలా ఉంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ కేంద్ర మంత్రిమండలి అమోదం తెలపటంపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ చట్టం పదును కోల్పోయిందంటూ దేశంలో ఉన్న దళితులందరూ ఆగ్రహం వ్యక్తం చేసి, రోడ్లమీదకు వచ్చి ఆందోళనలకు దిగటం, అదే విధంగా 11 మంది దళితుల అమరవీరుల త్యాగఫలం ఫలితంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.