ఆంధ్రప్రదేశ్‌

పోలీసులపై దాడులను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు/రాపూరు, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా రాపూరు పోలీసు స్టేషన్‌పై బుధవారం జరిగిన దాడిపై గుంటూరు జోన్ ఐజీ గోపాలరావు గురువారం విచారణ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన గాయపడిన ఎస్సై, సిబ్బందితో పాటు బాధితులను కూడా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై దాడులను ఉపేక్షించబోమన్నారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేశామని, వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన 12మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. పోలీసులు అంటే చులకనగా చూడటం మంచిది కాదన్నారు. రెండు సంవత్సరాలుగా రాపూరు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మణరావుపై ఆరోపణలు ఉంటే పైఅధికారులకు తెలిపితే చర్యలు తీసుకునేవారమని, కానీ పోలీసుస్టేషన్‌పై మూకుమ్మడి దాడిచేయడం సరికాదన్నారు. ఎస్సై వివాదాస్పదంగా వ్యవహరిస్తే జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్పా ఏకంగా ఎస్సైతోపాటు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించటం, దాడులకు పాల్పడటం మంచిది కాదన్నారు. ఇప్పటికే మీడియా క్లిప్పింగుల ద్వారా దాడులకు పాల్పడిన 50మందిని గుర్తించామని, వీరందరిపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాపూరు పోలీసు స్టేషన్‌పై స్థానికులు దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఐజీ వెంట జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, డీఎస్పీ రాంబాబు, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.