ఆంధ్రప్రదేశ్‌

దొంగల నాయకుడు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 3: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఒక దొంగల నాయకుడైతే, కొత్తగా శృతి కలిపిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చిల్లర నాయకుడని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
శుక్రవారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొన్న ఆయన రాజకీయాలు మాట్లాడేందుకు ఇది వేదిక కాదంటూనే జగన్, పవన్‌లపై ఘాటు విమర్శలు చేశారు. అవగాహనా రాహిత్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, రాష్ట్ర అభివృద్ధిపైనా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే ఏకైక లక్ష్యంగా జగన్ రాష్ట్ర ప్రయోజనాలను సైతం ప్రధాని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. పదవీకాంక్షతో, కేసుల మాఫీకోసం, బీజేపీతో కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న జగన్ ఆటలు సాగనీయబోమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీదే విజయమని స్పష్టంచేశారు. చేతిలో బెల్లం పెడితే పండుగ అనుకునే వ్యక్తి పవన్‌కళ్యాణ్ అన్నారు. సినిమాల్లో బాగా చేశాను, తాను ముఖ్యమంత్రినైపోతాను అంటూ పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు.
సినిమా హీరోలంతా సీఎంలు కాలేరని అది ఒక్క దివంగత నందమూరి తారక రామారావుకే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని భాషలు మాట్లాడుతారు అన్న విషయమే తెలియని పవన్ ముఖ్యమంత్రి అవుదామని అనుకోవడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వర్ల రామయ్య విరుచుకుపడ్డారు.