ఆంధ్రప్రదేశ్‌

ఉత్తమ అధికారులకు పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 15: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి పురస్కారాలు ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా 31 మందికి పది వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేసారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచి, ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యంగా అహర్నిశలు పనిచేసే పోలీసు అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్స్ (2015-17) అందజేసారు. ఇందులో అడిషనల్ డీజీపీ, వీసీఎండీ ఎపీపీహెసీ పీవీ సునీల్ కుమార్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ బి.చిట్టిబాబు, విశాఖ సిటీ అడిషనల్ డీసీపీ (క్రైం) వి.సురేష్‌బాబు, ఏఎస్పీ దొండ్ల నరహర, విజయనగరం ఎస్సై కె.ప్రసాదరావు, విశాఖసిటీ సీపీ మహేష్‌చంద్రలడ్డా, గ్రేహౌండ్ డిఐజీ వీనిత్‌బ్రీజల్, ఇంటెలిజెన్స్ ఎస్పీ (రిటైర్డు) పి.రమేషయ్య, విజయవాడ (క్రైం) అడిషనల్ డీజీపీ కె.పి.వెంకటేశ్వరావు, ఎ.ఎస్పీ బి.శ్రీనివాస్, ఎ.ఎస్పీ కె.ఎస్.నటరాజన్‌బాలాజీ, తిరుపతి ఎ.ఎస్పీ ఎం.వి.ఎస్.స్వామి, ఎ.ఎస్పీ అక్టోపస్ కె.నాగేష్‌బాబు, విజయవాడ క్రైం ఎసీపీ వి.సత్యన్నారాయణవర్మ, విజయవాడ ఈస్టు ఎసీపీ వి.విజయభాస్కర్, విశాఖసిటీ ఎసీపీ ఎ.నర్సింహమూర్తి, తిరుపతి సిఐడీ డీఎస్పీ బి.శ్రీనివాసులు, కర్నూల్ జిల్లా అందోని డీఎస్పీ అంకినీడుప్రసాద్, ఎసీబీ డి.ఎస్పీ కె.ఎస్.నంజునాధప్ప, కడపజిల్లా డీఎస్పీ ఆర్.రాజశేఖర్‌రాజు, తిరుపతి ఎసీబీ డీఎస్పీ ఎ.శంకర్‌రెడ్డి, నందిగామ డీఎస్పీ టి.రాధేశ్‌మురళీ, గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ వెంకటేశ్వరరావు, విజయవాడ సిటీ ఎస్సై ఖాసిమ్‌ఖాన్, విజయనగరం ఏఆర్‌ఎస్సై కె.వెంకట రమేష్, పశ్చిమగోదావరి ఎస్సై బి.పి.వి.వి.కుమార్, విజయనగరం ఎస్సై ఎం.జోగారావు, ఏలూరు ఎస్సై వి.వెంకటరాంబాబు, ఆత్మకూరు ఏఎస్సై ఎస్.సాయిప్రసాద్‌లకు పురస్కారాలు అందిచారు. వీరితోపాటు వంశధార ప్రాజెక్టులో లక్ష్యంనాటికి హిరమండలం రిజర్వాయర్‌లో ఫేజ్-2 కింద 8 టీఎంసీల నీటిని నిల్వ చేసిందుకుగాను శ్రీకాకుళం కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డికి ముఖ్యమంత్రి చేతులమీదుగా పురస్కారం అందజేసారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు డైరక్టర్ పి.శివశంకర్‌ను కూడా పుస్కారం అందజేసారు. విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల అధికారులకు పురస్కారాలు ప్రకటించారు.