ఆంధ్రప్రదేశ్‌

175 అసెంబ్లీ స్థానాలకు పోటీ: సోము వీర్రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 16 : బీజేపీకి అధికారం ఇస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపి స్వంతంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. కార్యకర్తలను సమాయత్తపరిచే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా నుండే శ్రీకారం చుట్టారన్నారు. ఏ రంగానికి కేంద్ర ప్రభుత్వం నిధుల ఎక్కువగా కేటాయిస్తుందో ఆ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకొని డబ్బులు దండుకుంటోందన్నారు. విద్యా విధానం కోసం అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.3500కోట్లు అందుతున్నాయని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇస్తున్న ఈ నిధులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య అభ్యసించే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారన్నారు. మొక్కల పెంపకం పేరుతో వేల కోట్లు రూపాయలు దోచేస్తున్నారన్నారు. బీజేపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రాష్టమ్రంతటిని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, దివంగత వైఎస్ పాదయాత్రలు చేసినప్పుడు, జగన్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పాదయాత్ర చేసినా, ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు జనం భారీగా వస్తున్నారని, ఈ ప్రభుత్వాలు సమస్యలు ఇంతకాలం తీర్చలేకపోయారని ప్రశ్నించారు.