ఆంధ్రప్రదేశ్‌

అటవీ శాఖ సిబ్బందికి ఆధునిక ఆయుధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఎర్ర చందాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అటవీ శాఖ సమాయత్తం అవుతోంది. ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని, ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన కొంతమంది ఎర్ర చందన వృక్షాలను నరికి, కలపను ఆక్రమంగా విదేశాలకు తరలిస్తుండటం తెలిసిందే. అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్ర చందనాన్ని భారీగా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వేలం వేయడం తెలిసిందే. అయితే ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తున్న వారి కదలికలను గుర్తించేందుకు కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అటవీ శాఖ సిబ్బందికి అత్యాధునిక ఆయుధాలను ఇవ్వడం ద్వారా స్మగ్లర్ల ఆట కట్టించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పోలీసుల తరహాలో అటవీ శాఖ సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇటీవల కాలంలో ఎర్ర దొంగల బెడద ఎక్కువ అవడం, అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడటం వంటి ఘటనల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవలే కోటి రూపాయలను రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్సు పథకం కింద ఆయుధాలను కొనుగోలు చేసేందుకు పాలనా ఆమోదాన్ని తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, కాన్పూర్‌లో ఉన్న ఇండియన్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీల నుంచి 125 రివాల్వర్లను (0.32) అటవీ శాఖ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుకు అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మంజూరు చేసింది.