తెలంగాణ

కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 3: తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయేనని, అలాగే అన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లిలో ఏర్పాటుచేసిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సం దర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్విగ్న భరితంగా ప్రసంగించారు. అంతకు ముందు వారు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్ధిళ్ళ శ్రీ్ధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటుచేసిన బస్సు యాత్రలో పాల్గొన్న అనం తరం కాటారం, భూపాలపల్లి మీదుగా మొగుళ్ళపల్లికి చేరుకున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో కల్లిబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత అవన్నింటిని మరిచిపోయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి విరుచుపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించడం కేసీఆర్ నైజమని ఉత్తమ్ దుయ్యబట్టారు. చేసేది తక్కువ చెప్పేదీ ఎక్కువగా కేసీఆర్‌కు పేరున్నదని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని ప్రకటించి తెలంగాణను భ్రష్టు పట్టించాడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా, ప్రతిపక్షాల వాణిని వినిపించనీయకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న తెరాస పాలనకు త్వరలోనే ప్రజలంతా చరమగీతం పలకాలని తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతులకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ఊరడించడం ఎక్కువైందనీ, నేటికీ ఎక్కడా ఒక్కరికి కూడా నయా పైసా అందించలేదని రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతాంగానికి ఎనలేని సేవలు చేసి భరోసా కల్పించామని వివరించారు. రానున్న రోజుల్లో నవ సూత్రాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వస్తుందని, అందరూ ఆశీర్వదించి, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అంతకు ముందు జిల్లాలోని రేగొండ మం డలం తిరుమలగిరి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గంట రఘుపతి అనే రైతు కుటుంబాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరామర్శించారు. యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించా రు. కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డికె ఆరుణ, దుద్ధిళ్ళ శ్రీ్ధర్‌బాబు, భట్టి విక్రమార్క, ఆరెపల్లి మోహన్, రేవంత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి, కటకం మృత్యుంజయం, గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

దళితులపై కాల్పులను ఖండిస్తున్నాం
భువనగిరి, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్న దళిత ఆందోళనకారులపై దుర్మార్గంగా కాల్పులు జరపడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని మాజీ ఎంపీ బృందాకారత్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మతతత్వ రాజకీయాలు-జాతీయ సమగ్రత అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ పాల్గొనేందుకు విచ్చేసిన బృందాకారత్ విలేఖ రుల సమావేశంలోమాట్లాడుతూ దళిత ఆందోళనకారులపై ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. కాల్పులలో 10 మంది దళితుల మరణం మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అమిత్‌షా కుమారుడు జైషాకు ఒకన్యాయం, దళితులకు మరో న్యాయమా? అని బృందాకారత్ ప్రశ్నించారు. బిజెపి ద్వంద్వ విధానాలు అవలంబి స్తోందని జైషాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతోనే కేంద్ర ప్రభుత్వం అడిషినల్ సొలిసిటర్ జనరల్‌ను పంపి వాదించి కాపాడారు, దళితుల రక్షణ కల్పించే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా తీర్పువస్తే బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను పంపలేదని విమర్శించారు.