తెలంగాణ

నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు పొందే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాచకొండ పోలీసులకు చిక్కిన ఇద్దరు మయన్మార్ దేశస్థులు
* నలుగురిని అరెస్టు చేసిన బాలాపూర్ పోలీసులు
హైదరాబాద్, మే 21: నకిలీ డాక్యుమెంట్లతో భారతీయ పాస్‌పోర్టులను ఫోర్జరీ చేసి పొందేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు మయన్మార్ దేశస్తులతో కలిపి మొత్తం నలుగురిని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సయ్యద్ నయిమ్, మహ్మద్ అఖీల్, మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైసల్‌ను అరెస్టు చేశారు. నయిం, అఖీల్ స్ధానికులు కాగా, మిగిలిన ఫయాజ్, ఫైసల్ మయన్మార్ దేశస్తులు. వీరిద్దరూ 2015 నుంచి బాలాపూర్ ప్రాంతంలో నివశిస్తున్నారు. వారసిగూడకు చెందిన నయిం వీసా ఏజెంట్‌గా పని చేస్తుండగా, అఖీల్ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఆధార్, పాన్‌కార్డు, వంటి నకిలీ ఐడిలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భారతీయ పాస్‌పోర్టులను అక్రమంగా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి నుంచి కొన్ని ఓటర్ ఐడి, పాన్‌కార్డులు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బినగర్ డిసిపి ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎసిపి గాంధీనారాయణ, ఇన్‌స్పెక్టర్లు ఎస్.మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ మహ్మద్ మఖ్బూల్ జానీలు నిందితులను అరెస్టు చేశారు.