తెలంగాణ

67 ప్రశ్నల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు నిర్వహించిన రిక్రూట్‌మెంట్ రాతపరీక్షలో 67 ప్రశ్నలను తొలగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయించింది. ప్రిన్సిపాల్ పోస్టులకు పరీక్ష నిర్వహించిన వెంటనే ఆ పేపర్ లీక్ అయిందనే వార్తలు వచ్చాయి. దానిపై పరిశీలించిన అధికారులు ఒక ప్రైవేటు బ్లాగ్‌లోని ప్రశ్నలు యథాతథంగా వచ్చాయని గుర్తించారు. ప్రశ్నపత్రాల సెట్టర్‌పై చర్యలు తీసుకోవాలని సర్వీసు కమిషన్ నిర్ణయించింది. 14వ తేదీన టీఎస్‌పిఎస్సీ నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలో పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 200 వరకూ ప్రశ్నలు ఒక ప్రైవేటు బ్లాగ్‌లోనివే వచ్చాయని తెలిసింది. ఈ మేరకు కొంత మంది అభ్యర్ధులు కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కొంత మంది వాట్సప్ గ్రూప్‌లో కూడా ఈ ప్రశ్నలు హల్‌చల్ చేయడమేగాక, బాగా రాశామనే అభిప్రాయాన్ని అభ్యర్ధులు వ్యక్తం చేశారు. రెండు పేపర్లలో 300 ప్రశ్నలకు ఒక బ్లాగ్ నుండి 200 ప్రశ్నలు రావడంపై మిగిలిన అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ డాట్ బ్లాగ్‌స్పాట్ డాట్ కామ్ అనే పోర్టల్ నుండి ఈ ప్రశ్నలు వచ్చినట్టు గుర్తించారు. టీఎస్‌పిఎస్సీ పేపర్ లీక్ అయిందేమో అని తొలుత భావించినా తర్వాత బ్లాగ్‌లోని ప్రశ్నలను పరిశీలించినపుడు 67 ప్రశ్నలు వచ్చినట్టు గుర్తించారు. దాంతో వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈవెంట్స్ రంగంలో అపార అవకాశాలు
- ప్రభుత్వ సలహాదారుడు రమణ చారి -
హైదరాబాద్, మే 21: ఈవెంట్స్ రంగానికి నానాటికి ఆదరణ పెరుగుతుండటంతో ఈ రంగంలో అపార అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారుడు కేవీ.రమణ చారి అన్నారు. సోమవారం నగరంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఇఐ) నిర్వహించిన కార్యక్రమానికి రమణ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాలను అదుభతంగా నిర్వహింఛడంలో ఈవెంట్స్ సంస్థల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. భారీ కార్యక్రమాలను సైతం సులువుగా నిర్వహించుకునేలా తోడ్పాటును అందిస్తున్న ఈటెంట్ సంస్థలు అసోసియేషన్‌గా ఆవిర్భవించడం సంతోషకరమన్నారు. నూతనంగా బాధ్యతలు కార్యవర్గాన్ని రమణ చారి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ త్వరలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.