తెలంగాణ

అడవుల్లో అగ్నిప్రమాదాలపై ముందస్తు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. పట్టణీకరణ, వివిధ కారణాలతో అంతరించి పోతున్న అటవీ సంపద అగ్నిప్రమాదాల కారణంగా విలువైన వన సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. మండు వేసవిలో అడవుల్లో చిన్నపాటి నిప్పు రవ్వలతో మొదలౌతున్న మంటలు క్షణాల్లో పూర్తిగా వ్యాపించి అడవిని దహించి వేస్తున్నాయి. తరుచూ చోటుచేసుకుంటున్న ఇలాంటి ప్రమాదాలతో వన్యప్రాణుల పరిస్థితి అగమ్యగోచారంగా మారుతోంది. ప్రమాదాల కారణంగా వేలాది మూగ జీవాలు సజీవ దహనం అవుతుండగా, స్థావరాలు కోల్పోయిన ప్రాణులు మనుగడ కోసం తపించాల్సిన దుస్థితి నెలకొంటుంది. అడవి మధ్యలో చెలరేగే మంటల విషయం అధికారుల దృష్టికి వచ్చేలోపే పెను నష్టం జరిగిపోతోంది. వీటన్నింటి నేపథ్యంలో అడవిని, అడవిలోని జంతువులను సంరక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
జాతీయ అటవీ సంరక్షణ శాఖ నిత్యం శాటిలైట్ ద్వారా అడవుల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎక్కడైనా చిన్నపాటి పొగలు కనిపించినా ఆయా రాష్ట్రాల అటవీ అధికారులను అప్రమత్తం చేస్తుండటంతో ప్రమాదాలను నివారించగలుగుతున్నారు. వేసవిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా ఎండిన కొమ్మలు, ఆకులను కాల్చివేయడంతో పాటు ప్రత్యేక కందకాలను తవ్వుతున్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా స్థానిక ఐటి అధికారులకు హెచ్చరికలు రాగానే అప్రమత్తం అవుతున్న అధికారులు క్షణాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఫైర్ ఫైటర్స్ బృందాలను సంఘటన స్థలానికి చేర్చి మంటలను అదుపులోనికి తీసుకువస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతితను సమర్థవంతంగా వినియోగించుకోవడం, స్థానిక అధికారులు, గిరి పుత్రుల సహాయంతో అడవి సంరక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు.