తెలంగాణ

రేపు టీటీడీపీ మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు గురువారం నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 24న జరగనున్న రాష్ట్ర స్థాయి మహాసభకు సన్నాహక సభలను రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజక వర్గ స్థాయిల్లో పార్టీ ఇప్పటికే పూర్తి చేసింది. బడుగు, బలహీన వర్గాలను రాజాధికారాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్‌టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడు మహానాడులను నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏటి మహాసభలను ఈనెల 24న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ తెలిపారు. మంగళవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మహానాడు విషయాలను వెల్లడించారు. 17 పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 19 మిని మహానాడులను నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రతి చోట ఐదు నుంచి ఆరు వేల మంది పాల్గొనడం పార్టీకి నూతనోత్తేజాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలుగుదేశంలోని ప్రతి కార్యకర్త ఎదురుచూసే కార్యక్రమం మహానాడు అని అన్నారు. ఈనెల 27 నుంచి 29 వరకు ఏపీ రాజధాని విజయవాడలో జరిగే మహానాడులో ఐదు తీర్మానాలను, తెలంగాణ జరిగే మహానాడులో ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడట్టంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు.
24న ఎన్‌టీఆర్ ఘాట్ వెళ్లి ఎన్‌టీ ఆర్‌కు నివాళ్ళర్పించిన అనంతరం నాంపల్లిలోని సభా వేదిక వద్దకు వెళతామని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. పార్టీ పరంగా అతి కీలకమైన నిర్ణయాలను ప్రకటించే మహానాడులో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొని పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.