తెలంగాణ

డిసెంబర్ వరకు 40 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: వచ్చే జూన్ నాటికి హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. బేగంపేట మెట్రోరైలు భవన్‌లో బుధవారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిని మంత్రి సమీక్షించారు. నగరంలో 109 ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇదే వేగంతో పనులు జరిగితే కచ్చితంగా డిసెంబర్ నాటికి 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నమన్నారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వామ్యం చేయడం వల్ల పర్యవేక్షణ, నిర్మాణ వేగం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణం జరుగుతోన్న వర్క్ సైట్ల వివరాలను ఎమ్మెల్యేలు, ఎంపీలకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు ఆధార్ కార్డు, బయో మెట్రిక్, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జెఎన్‌ఎన్‌యుఆర్, గృహకల్ప ప్రాజెక్టుల్లో మిగిలిన సుమారు 13 వేల ఇళ్లను లబ్దిదారులకు అందించడానికి జాబితా రూపొందించాలని, నిధులు అవసరమైతే ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
వందలు, వేలల్లో ఇళ్ల నిర్మా ణం జరుగుతోన్న ప్రాంతాల్లో రోడ్లు, మంచినీరు, పోలీసు స్టేషన్లు వంటి వౌలిక వసతుల కల్పనకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ఇవీ పూర్తయ్యే నాటికి అందుబాటులోకి తీసుకరావాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు.