తెలంగాణ

కేసీఆర్ అవినీతి బయటపెట్టేందుకేకాంగ్రెస్‌లో చేరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయణ రుణ మాఫీ చేస్తామని తమ పార్టీ ఇచ్చిన హామీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి ఆయన బుధవారం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి చూపిస్తామన్నారు. రైతులను సంక్షోభం నుంచి కాపాడాలన్న లక్ష్యంతో ఈ హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ చేసిన రుణ మాఫీతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోయారని ఆయన తెలిపారు.
పంటకు మద్దతు ధర లేక రైతు ఎకరాకు 22 వేల రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు కూడా పంటకు పెట్టుబడి సహా యం అందించాలని ఆయన డిమాండ్ చేశా రు. కేసీఆర్ అవినీతిని అంతం చేస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని ఆయన చెప్పారు. దామోదర్ రెడ్డితో కలిసి పని చేస్తానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. జోనల్ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని నాగం విమర్శించారు.