తెలంగాణ

ఎమ్సెట్ సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: ఎమ్సెట్ ఇంజనీరింగ్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు ఇంత వరకూ 25,370 మంది హాజరయ్యారు. 25వేల లోపు ర్యాంకర్లను పిలవగా, అం దులో 15557 మంది, 25,001 నుండి 40వేల ర్యాంకు వరకూ 9813 మంది మాత్రమే హాజరయ్యారు. వీరందరిలో ఇంత వరకూ 4584 మంది వెబ్ ఆప్షన్లను నమోదుచేశారు.
31వ తేదీన 54వేల ర్యాంకు వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావల్సి ఉంటుంది. 31వ తేదీ స్పెషల్ కేటగిరి అభ్యర్ధులకు సైతం సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 5వ తేదీ వరకూ అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు.
పాలిటెక్నిక్‌లో 68 శాతం సీట్ల భర్తీ
పాలిటెక్నిక్‌లో 38,089 సీట్లకు గానూ 25,896 సీట్లు భర్తీకాగా, ఇంకా 12,193 సీట్లు భర్తీ కావాల్సి ఉందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. 55 ప్రభుత్వ కాలేజీల్లో 11619 సీట్లకు 11296 సీట్లు భర్తీ అయ్యాయని, రెండు ఎయిడెడ్ కాలేజీల్లో 360 సీట్లకు 358 సీట్లు, 112 ప్రైవేటు కాలేజీల్లో 26110 సీట్లకు 14242 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. 23వ తేదీ నుండి 28 వరకూ వెబ్ ఆప్షన్ల ఇంప్రూవ్‌మెంట్ రౌండ్ నిర్వహించామని, 21,570 మంది తొలి రౌండ్‌లో చేరగా, ఇంప్రూవ్‌మెంట్ రౌండ్‌లో 3698 మరింత మంచి అవకాశాలు లభించాయని ఆయన వివరించారు.
ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలు
ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఎస్సెస్సీలో 53,097 మంది పరీక్ష రాయగా 11946 మంది, ఇంటర్‌లో 39,561 మంది పరీక్ష రాయగా, 12,745 మంది ఉత్తీర్ణులయ్యారు.
డిప్యూటీ సర్వేయర్ల ఫలితాలు
డిప్యుటీ సర్వేయర్ల ఎంపిక పరీక్ష ఫలితాలను పబ్లిక్ సర్వీసు కమిషన్ బుధవారం నాడు విడుదల చేసింది. గత ఏడాది జూన్ 2న ఇచ్చిన 34/17 నోటిఫికేషన్ ఆధారంగా గత ఏడాది ఆగస్టు 20న ఒఎంఆర్ పరీక్ష నిర్వహించి, సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియను ముగించిన సర్వీసు కమిషన్ బుధవారం నాడు 273 మందిని డిప్యుటీ సర్వేయర్లుగా ఎంపిక చేసింది. జాబితాను కమిషన్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
55 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
పాఠశాల విద్యాశాఖ పరిధిలో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ పరిధిలో 3 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 24 పీజీటీ, 28 టీజీటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ పోస్టులను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. సర్వీసు కమిషన్ నుండి గురుకులాల రిక్రూట్‌మెంట్‌ను తప్పించిన ప్రభుత్వం తొలి నోటిఫికేషన్‌కు మార్గం సుగమం చేసింది. కాగా కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్‌లో నాలుగు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు, ఒక స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు ప్రభుత్వం ఆదేశించింది.