తెలంగాణ

త్వరలో డిండి ఎత్తిపోతల ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: డిండి ఎత్తిపోతల పథకం ఫలాలను త్వరలో రైతులకు అందిస్తామని నీటిపారుదలశాఖ టి హరీశ్‌రావు ప్రకటించారు. కాలువల పనులు అక్టోబర్-నవంబర్ లోగా పూర్తి చేసి సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గొట్టిముక్కల రిజర్వాయర్ ద్వారా తొలి ఫలాలు రైతులకు అందబోతున్నాయన్నారు. జలసౌధలో ఎత్తిపోతల పథకాల పురోగతిపై బుధవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దున్నపోతుల గండి, నూతన పాలెం, కేశవపురం ఎత్తిపోతల పథకాల కింద చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ హైలెవల్ కెనాల్-8,9లో 23 కిలో మీటర్ల తర్వాత దాదాపు 8 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చలకుర్తి ఎత్తిపోతల ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండటం వల్ల నీటి పంపింగ్‌లో అంతరాయం ఏర్పడినట్టు వివరించారు. దీనిని అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పంపులను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. అక్కంపలి బాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్‌కు నిరంతరం నీరు సరఫరా చేయడం వల్ల కెనాల్ కోతకు గురవుతోందని అధికారులు వివరించారు. కెనాల్ కోతకు గురికాకుండా లైనింగ్ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ లైనింగ్ ఉదయ సముద్రం కింది వరకు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.