తెలంగాణ

బియ్యం తినడం కోసమే...అమ్ముకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30 రైతాంగం నుంచి 35లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 33 లక్షల ధాన్యాన్ని సేకరించామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని ఆయ న చెప్పారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసే డీలర్లు అక్రమంగా ధాన్యం అమ్మాలని చూస్తే మాత్రం వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బీడు భూములను సాగు భూమలుగా చేయడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, దీంతో రానున్న రోజు ల్లో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ పాస్ విధానంతో బియ్యం అక్రమ రవా ణా ఆగిందన్నారు. రాష్ట్రంలో 2,74 కోట్లు పేదలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బియ్యం తీసుకోకపోయినా మీ కార్డులు భద్రంగా ఉంటాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం కొనసాగుతుందని, 2లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైస్ మిల్లర్లతో మంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సంస్థ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు.